చిట్వేల్ మండలం కే.కందులవారిపల్లిలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గ్రామంలోని కందుల దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వందలాది మంది భక్తులు వినాయక స్వామి దరికి చేరుకుని ప్రత్యేక పూజలు చేసుకొని అనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ప్రత్యేకత ఏమిటంటే : భోజనానికి మిగిలిన ఆహారాన్ని వృథా కాకుండా రాపూర్ ఘాటులోని కోతులకు అందించారు. కందుల దర్గా, కందుల చౌదరి, మరియు కే.కందులవారిపల్లి యువత ముందడుగు వేసి ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ యూత్ అందరూ కలిసి కోతులకు ఆహారం పంచడం ద్వారా వినాయక చవితి పండుగను మరింత విశిష్టంగా నిలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ, “అన్నం పరబ్రహ్మ స్వరూపం. దానిని పంచడం ద్వారానే పండుగకు పూర్తి సార్థకత లభిస్తుంది” అని అభిప్రాయపడ్డారు.


