ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ 60 వ పుట్టినరోజు వేడుకలు కొవ్వూరులోని ఆయన నివాస ప్రాంగణంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, అధికారులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ కు చెందిన చైర్మన్లు ,డైరెక్టర్లు నాయకులు అభిమానులు భారీ సంఖ్యలో హాజరై జవహర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
తాళ్లపూడి మండలానికి చెందిన జిల్లా తెలుగు యువత నాయకులు నామా సురేంద్ర కుమార్ మరియు సిద్ధన రాధాకృష్ణ ఆధ్వర్యంలో 60వ జన్మదిన వేడుక గుర్తుగా 60 కేజీల భారీ కేక్ ను ఏర్పాటు చేసి జవహర్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో జవహర్ ఎమ్మెల్యే , మంత్రిగా మరియు పార్లమెంటు అధ్యక్షుడుగా ఉన్న సమయంలో ప్రతి ఏటా ఇదే తరహాలో భారీ కేకును ఏర్పాటు చేసేవారు ఈ భారీ కేక్ ను నాయకులు మరియు అభిమానులు సమక్షంలో జవహర్ తో కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకకు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి జవహర్ ధన్యవాదాలు తెలిపారు.




