Friday, 6 February 2026
  • Home  
  • కెఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా ఉచిత ఉచిత శిబిరం
- విశాఖపట్నం

కెఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా ఉచిత ఉచిత శిబిరం

ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి ★ కెఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా ఉచిత ఉచిత శిబిరం ★ 300 మందికి ఉచిత వైద్య పరీక్షలు *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్, కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కందుల నాగరాజు తెలిపారు. కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్లిపురం జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ కందుల నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ వైద్య శిబిరంలో సుమారు 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేయడం. అలాగే కొందరికి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి కొందరికి కళ్లద్దాలు రాయడం జరిగిందని మరికొందరికి డాక్టర్ల సలహా మేరకు ఆపరేషన్ చేయాలని నిర్ధారించడం జరిగిందని వెల్లడించారు. అలాగే ఇక్కడ క్యాన్సర్ పరీక్షలు కూడా నిర్వహించడం జరిగిందన్నారు. స్త్రీలకు, చిన్న పిల్లలకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు, కళ్ళు, షుగర్, బిపి, క్యాన్సర్, డెంటల్, ఈసీజీ పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్, కేర్ హాస్పిటల్, పుష్పగిరి ఐ హాస్పిటల్ వైద్య సిబ్బంది ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నట్లు వెల్లడించారు. ఈ మెగా ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి కూడా అనూహ్యస్పందన వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వైద్య సిబ్బంది డాక్టర్ సుభద్ర, డాక్టర్ సౌజన్య, డాక్టర్ పాల్, కోఆర్డినేటర్ సిహెచ్ స్వాతి శ్రీ, నర్సింగ్ స్టాప్ గౌరీ, రమాబాయి, కుమారి, కేర్ ఆస్పటల్ వైద్య సిబ్బంది డాక్టర్ సురేష్, కోఆర్డినేటర్ సతీష్, నర్సింగ్ స్టాప్ మౌనిక, పుష్పగిరి ఐ హాస్పిటల్ సిబ్బంది మార్కెటింగ్ మేనేజర్ నాగరాజు, స్టాఫ్ హైందవి, శృతి పాల్గొన్నారు. అలాగే కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు టి. లక్ష్మి, ఎం. శాతవాహన, కే .జ్యోతి, పి.గీత, కే .రమేష్ ,ఎం. శ్రీనివాస్, సిపిఐ బుజ్జి, కే. అప్పారావు, వై. లక్ష్మీనారాయణ, కందుల కృష్ణ, కందుల నాగేంద్ర, యు.అలేఖ్య, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ , కుమారి తదితరులు పాల్గొన్నారు.

ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
★ కెఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా ఉచిత ఉచిత శిబిరం
★ 300 మందికి ఉచిత వైద్య పరీక్షలు

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి*

ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్, కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కందుల నాగరాజు తెలిపారు.
కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్లిపురం జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ కందుల నాగరాజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ వైద్య శిబిరంలో సుమారు 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేయడం. అలాగే కొందరికి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి కొందరికి కళ్లద్దాలు రాయడం జరిగిందని మరికొందరికి డాక్టర్ల సలహా మేరకు ఆపరేషన్ చేయాలని నిర్ధారించడం జరిగిందని వెల్లడించారు. అలాగే ఇక్కడ క్యాన్సర్ పరీక్షలు కూడా నిర్వహించడం జరిగిందన్నారు.
స్త్రీలకు, చిన్న పిల్లలకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు, కళ్ళు, షుగర్, బిపి, క్యాన్సర్, డెంటల్, ఈసీజీ పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు.
మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్, కేర్ హాస్పిటల్, పుష్పగిరి ఐ హాస్పిటల్ వైద్య సిబ్బంది ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నట్లు వెల్లడించారు.
ఈ మెగా ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి కూడా అనూహ్యస్పందన వచ్చిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాతీయ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వైద్య సిబ్బంది డాక్టర్ సుభద్ర, డాక్టర్ సౌజన్య,
డాక్టర్ పాల్, కోఆర్డినేటర్ సిహెచ్ స్వాతి శ్రీ, నర్సింగ్ స్టాప్ గౌరీ, రమాబాయి, కుమారి, కేర్ ఆస్పటల్ వైద్య సిబ్బంది డాక్టర్ సురేష్, కోఆర్డినేటర్ సతీష్, నర్సింగ్ స్టాప్ మౌనిక, పుష్పగిరి ఐ హాస్పిటల్ సిబ్బంది మార్కెటింగ్ మేనేజర్ నాగరాజు, స్టాఫ్ హైందవి, శృతి పాల్గొన్నారు.
అలాగే కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు టి. లక్ష్మి, ఎం. శాతవాహన, కే .జ్యోతి, పి.గీత, కే .రమేష్ ,ఎం. శ్రీనివాస్, సిపిఐ బుజ్జి, కే. అప్పారావు, వై. లక్ష్మీనారాయణ, కందుల కృష్ణ, కందుల నాగేంద్ర, యు.అలేఖ్య, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ , కుమారి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.