*శాంతిభద్రతలను పరిరక్షించడంలో, ప్రజా సమస్యల పరిష్కారంలో, మహిళల భద్రతను పెంచడంతో పాటు సైబర్ నేరాలను నియంత్రించడమే ప్రధాన లక్ష్యం: జిల్లా నూతన ఎస్పి విద్యాసాగర్ నాయుడు*
ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడిన విద్యాసాగర్ నాయుడు.
*మీడియా సమావేశంలో ఎస్పీ విద్యాసాగర్ కామెంట్స్*
గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాలను జిల్లాలోకి ప్రవేశించకుండా ఉక్కు పాదం మోపుతాం.
మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడంలో ప్రత్యేక పాత్రను పోషిస్తా.
సిబ్బంది సంక్షేమం లో రాజీ పడేది లేదు.
వారి సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి.
ఎంతో ప్రఖ్యాత చరిత్ర కలిగిన కృష్ణాజిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది.
ప్రజా సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను అనుసరించి విధి నిర్వహణ కనపరుస్తా.
ప్రత్యేకంగా మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.
జిల్లాను నేర రహితంగా తీర్చిదిద్దేందుకు సిబ్బందిని ఎల్లవేళలా అప్రమత్తం చేస్తాను.
సిబ్బంది సమస్యల పరిష్కారం లో ఎల్లవేళలా ముందు ఉంటా…
24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీస్ సేవలు అందిస్తా.
▪చిన్నారులు, వృద్ధులకు, మహిళలకు రక్షణ కల్పనలో ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.
శాంతి భద్రతల పరిరక్షణలో స్థాయి భేదం చూపించకుండా అందరితో కలిసి పనిచేస్తాను.,
సమస్యలపై జిల్లా ప్రజలు నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చు.
చట్టాన్ని ఉల్లంఘించి అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం దిశగా కార్యాచరణ ఉంటుంది


