కృష్ణాజిల్లా పోలీస్
*గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే ఉత్సవ కమిటీలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి – జిల్లా ఎస్పీ శ్రీ ఆర్. గంగాధరరావు, ఐపిఎస్.,*
– పర్యావరణ రక్షణకు నిర్వాహకులు పోలీసువారికి సహకరించాలి.
– ప్రజారోగ్యం మరియు భద్రత దృష్ట్యా DJ లు, బాణాసంచా పూర్తిగా నిషేదం.
– వాహనాల రాకపోకలకు ప్రజాజీవనానికి అంతరాయం కలిగించేలా మండపాలు రోడ్లపై ఏర్పాటు చేయొద్దు.
– సంభందిత శాఖల నుండి ముందస్తు అనుమతులు తప్పనిసరి.
… *ఆర్.గంగాధర రావు, ఐపిఎస్, ఎస్పి కృష్ణా జిల్లా*.
గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకునే నిర్వాహకులు, ప్రజలకు, ఇతరులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పి ఆర్.గంగాధర రావు ఐపిఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపినారు.
▪️త్వరలో రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఉత్సవ కమిటీలు, యువత ముందస్తు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని భద్రత పరమైన చర్యల దృష్ట్యా పోలీసు శాఖ సూచించే నియమ నిభందనలు పాటించాలని ఎస్పి గారు కోరారు.
▪️ మట్టి గణపతి ప్రతిమను ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణకు బాధ్యతగా ఉండాలని అన్నారు.
▪️ పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటూ, అధిక శబ్దాలతో కూడిన డీజే బాక్సులు వినియోగించడం వంటివి చేయరాదని, ప్రజలకు ఇబ్బంది కలిగేలా బాణసంచా కాల్చే వద్దని సూచించారు.
▪️ మండపాల ఏర్పాటుకు ముందస్తుగా అన్ని శాఖల నుండి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని అన్నారు. ప్రయాణికులకు, సామాన్యులకు, ఇతర మతస్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా మండపాలు ఏర్పాటు చేయడం మంచిది అని తెలిపారు.
▪️ మతసామరస్యాలకు ప్రతీకగా గణేష్ ఉత్సవాలు ఉండాలని అన్నారు. మండపాల వద్ద నిబంధనలు పాటించాలి, పోలీసు అనుమతులు తీసుకోవాలని కోరారు. శాంతి, సామరస్యానికి మనం పాటుపడాలి, సోదరభావంతో అందరూ కలిసి మెలిసి ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు.
▪️ జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు పటిష్ఠమైన పోలీసు భద్రత ఉంటుంది, ప్రశాంత వాతావరణంలో నవరాత్రులు జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
*పోలీసు సూచనలు*
👉🏻 రోడ్లు ఆక్రమించి గణేష్ మండపాలు ఏర్పాటు చేయరాదు, ట్రాఫిక్ అంతరాయం కలిగించరాదు.
👉🏻 DJ ల వినియోగానికి , బాణాసంచా పేల్చుటకు కు అనుమతి లేదు.
👉🏻 మండపాల వద్ద మరియు ఊరేగింపు సమయంలో భక్తి సంబంధిత పాటలు మాత్రమే ప్రసారం చేయాలి.
👉🏻 మండపాలు ఏర్పాటు చేసే స్థలం పబ్లిక్ స్థలం అయితే సంబంధిత గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీ అనుమతి పత్రం తీసుకోవాలి.
👉🏻 ప్రవేట్ వ్యక్తుల స్థలం అయితే స్థల యజమాని అనుమతి పత్రం తీసుకోవాలి.
👉🏻 ఉత్సవాలు ముగిసే వరకు ఉత్సవ కమిటీ సభ్యులు 24 గంటలు మండపాల వద్ద అందుబాటులో ఉండాలి.
👉🏻 మండపాల వద్ద CC కెమెరాలు అమర్చాలి.
👉🏻 విద్యుత్ శాఖ అనుమతి ఉండాలి.
👉🏻 వివాదాస్పద స్థలాల్లో గణేష్ మండపాలు ఏర్పాటు చేయొద్దు.
👉🏻 ఇతరులను రెచ్చగొట్టే విధంగా, వివాదాస్పదంగా మండపాల వద్ద ప్రసంగాలు చేయరాదు.
👉🏻 నిబంధనలు పాటించకపోయిన లేదా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా అనుమతి కోరిన అర్జీదారులు, ఉత్సవకమిటీ సభ్యులే పూర్తి బాధ్యత వహించాలి.


