కృషి విజ్ఞాన కేంద్రం యాగంటిపల్లి నందు వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పీ యం కిసాన్ 20 వ విడత నగదు బదిలీ – అన్నదాత సుఖీభవ ప్రారంభ కార్యక్రమం డా. జి ధనలక్ష్మి, సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ అధ్యక్షతన నిర్వహించారు. వీరు మాట్లాడుతూ పీఎం కిసాన్ కార్యక్రమం ప్రాముఖ్యత వివరిస్తూ రైతులు ఈ పథకం 2019 నుండి ప్రారంభమై 20 వ విడత క్రింద దాదాపుగా ఇరవైవేల కోట్ల రూపాయలు పది కోట్ల మంది రైతులకు అందజేస్తున్నట్లుగా వివరించారు.
ముఖ్య అతిధిగా భూపాల్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఎస్ ఆర్ బీ సి, వారు పాల్గొని ఈ రోజు జిల్లాలో 3.93 లక్షల మంది రైతుల ఖాతాల్లో 140 కోట్ల రూపాయలు జమచేయనున్నట్లు తెలిపారు. అనంతరం ప్రధానమంత్రి పీ ఎమ్ కిసాన్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని, అలాగే రాష్ట్ర ప్రభుత్వ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం లో వీక్షించారు. శాస్త్రవెత్తల సలహాలతో రసాయన ఎరువుల పై ఖర్చు తగ్గించే మార్గాలపై ద్రుష్టి సరించాలన్నారు.
వ్యవసాయ ఏ డి ఏ, కోయిలకుంట్ల సుధాకర్ మాట్లాడుతూ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.5000 మరియు కేంద్ర ప్రభుత్వం రూ 2000 లబ్దిదారులకు అందచేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన వారు నగదు జమ కాకపోతే సంబంధిత వ్యవసాయ సేవా కేంద్రం సంప్రదించాలని సుంచించారు అనంతరం శాస్త్రవెత్తలు మాట్లాడుతూ ప్రస్తుతం వరి, మొక్కజొన్న పంటల్లో చీడ పీడల యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం మరియు ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం లో *మండల రెవెన్యూ అధికారి నారాయణ రెడ్డి పాల్గొని సి సి ఆర్ సి కార్డు కలిగిన కౌలు రైతుకూడా అన్నదాత సుఖీభవకు అర్హులని కౌలు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమం లో రాజశేఖర్ రెడ్డి చైర్మన్ వాటర్ యూస్ అసోసియేషన్, సురేష్ కుమార్, కేవీకే పరిపాలన అధికారి, బనగానపల్లి మండల వ్యవసాయ అధికారి సుబ్బారెడ్డి, ఎమ్. పీ. డి. ఒ సయ్యద్ మొహమ్మద్ అలీ, జోనల్ మేనేజర్, కోరమండల్ టిడిపి నాయకులు మౌలేశ్వర్ రెడ్డి, మహేశ్వర రెడ్డి, భూషన్న, పాల్గొన్నారు


