
ఉత్తరాంధ్ర నుంచి ప్రభుత్వంపై పోరుబాటకు వైయస్సార్సీపీ సిద్ధమైంది. ఈ నెల 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని మాజీ సీఎం వై.ఎస్. జగన్ సందర్శించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.
విశాఖలో జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాల సమీక్షా సమావేశంలో రీజినల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, బొత్స సత్యనారాయణ కూటమి వైఫల్యాలను తీవ్రంగా విమర్శించారు.
కూటమి పాలనలో ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతోందని, విలువైన భూములను కార్పొరేటర్లకు కట్టబెడుతున్నారని, విశాఖ అభివృద్ధి పణంగా పెట్టి అమరావతి కోసం అప్పులు తెస్తున్నారని వారు ఆరోపించారు.
వైయస్సార్సీపీ నిర్ణయం —
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేదాకా ఉద్యమం
ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్రం, ఒడిశా ప్రభుత్వాలతో చర్చలు జరపాలని డిమాండ్

