Sunday, 22 March 2026
  • Home  
  • కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి,కొత్తపేట నియోజక వర్గ వైఎస్ఆర్సిపి పరిశీలకులు,పాటి శివకుమార్ గారు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి,కొత్తపేట నియోజక వర్గ వైఎస్ఆర్సిపి పరిశీలకులు,పాటి శివకుమార్ గారు

ప్రెస్ నోట్ : 02/11/2025, మలికిపురం. 01/11/2025 శనివారం నిన్నటి రోజున శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ప్రభుత్వం నుండి సరైన ఏర్పాట్లు చేయకపోవడం, పోలీసు బందోబస్తు లేకపోవడం వల్ల జరిగినటువంటి ఈ తొక్కిసలాట లో సుమారు 9 మంది భక్తుల మృతి, 20 మందికి పైగా గాయాలు, ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది,ఈ సంఘటనకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని , అంత భారీ స్థాయిలో భక్తులు వస్తున్నారని విషయాన్ని ఇంటలిజెన్స్ వ్యవస్థ ద్వారా గాని ప్రభుత్వానికి ఉన్నటువంటి వివిధ వ్యవస్థల ద్వారా గాని కచ్చితంగా సమాచారం తెచ్చుకుని ప్రజల యొక్క భద్రతను చూడాల్సిన ఆవశ్యకత ప్రభుత్వం మీద ఉంది , అయినప్పటికీ ఈ సంఘటనకు బాధ్యత వహించాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి గానీ మంత్రులు గాని ఆ దేవాలయం దేవాదాయ శాఖ పరిధిలో లేదని, ఇటువంటి సంఘటనలు అలా జరుగుతూ ఉంటాయని బాధ్యత లేకుండా మాట్లాడటం ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యత గల ముఖ్యమంత్రి కి మంత్రులకు తగదని దీనికి సంపూర్ణమైన బాధ్యత వహించాల్సిన అవసరం ప్రభుత్వానిదే అని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి,కొత్తపేట నియోజక వర్గ వైఎస్ఆర్సిపి పరిశీలకులు,పాటి శివకుమార్ గారు తీవ్రంగా ఖండించారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి,సింహాచలం వంటి దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి పెద్ద దేవాలయాల్లో సైతం ఎక్కువ భక్తులు పోటెత్తేటువంటి దేవాలయాల్లో కూడా సరైన జాగ్రత్తలు తీసుకొని కారణం చేతనే భక్తుల మరణాలు సంభవించాయని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలు సుస్పష్టంగా ప్రజలకు అర్థం అవుతున్న సందర్భంలో ఇటువంటి పరిస్థితులను డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఈ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అలవాటుఅని నిన్న శ్రీకాకుళంలో జరిగిన తొక్కిసలాట లో చనిపోయిన ఉదంతానికి ప్రభుత్వం మీద ప్రజల్లో వచ్చుచున్నటువంటి వ్యతిరేకతను డైవర్ట్ చేయడం కోసం మాజీ మంత్రి, బీసీ నేత జోగి రమేష్ గారిని ఆయనకి సంబంధంలేని నకిలీ మద్యం కేసులో అరెస్టు చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, జరిగిన తప్పుని హుందాతనంగా ఒప్పుకుని భవిష్యత్తులో ఈ పరిస్థితులు రాకుండగా హిందూ ధర్మాన్ని కాపాడతామని చెప్పాల్సిన ప్రభుత్వం ఈ విధమైన రాజకీయాలు చెయ్యడం సిగ్గు చేటు అని,ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి కూడా హిందుత్వంపై, హిందూ దేవాలయాలపై, హిందూ దేవాలయాలకు వెళ్తున్నటువంటి భక్తులపై వీరు చూపిస్తున్న నిర్లక్ష్యానికి ప్రజలు ,భగవంతుడు ఈ ప్రభుత్వానికి శిక్ష వేస్తారని పాటి శివకుమార్ అన్నారు.

ప్రెస్ నోట్ :
02/11/2025,
మలికిపురం.

01/11/2025 శనివారం నిన్నటి రోజున శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ప్రభుత్వం నుండి సరైన ఏర్పాట్లు చేయకపోవడం, పోలీసు బందోబస్తు లేకపోవడం వల్ల జరిగినటువంటి ఈ తొక్కిసలాట లో సుమారు 9 మంది భక్తుల మృతి, 20 మందికి పైగా గాయాలు, ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది,ఈ సంఘటనకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని , అంత భారీ స్థాయిలో భక్తులు వస్తున్నారని విషయాన్ని ఇంటలిజెన్స్ వ్యవస్థ ద్వారా గాని ప్రభుత్వానికి ఉన్నటువంటి వివిధ వ్యవస్థల ద్వారా గాని కచ్చితంగా సమాచారం తెచ్చుకుని ప్రజల యొక్క భద్రతను చూడాల్సిన ఆవశ్యకత ప్రభుత్వం మీద ఉంది , అయినప్పటికీ ఈ సంఘటనకు బాధ్యత వహించాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి గానీ మంత్రులు గాని ఆ దేవాలయం దేవాదాయ శాఖ పరిధిలో లేదని, ఇటువంటి సంఘటనలు అలా జరుగుతూ ఉంటాయని బాధ్యత లేకుండా మాట్లాడటం ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యత గల ముఖ్యమంత్రి కి మంత్రులకు తగదని దీనికి సంపూర్ణమైన బాధ్యత వహించాల్సిన అవసరం ప్రభుత్వానిదే అని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి,కొత్తపేట నియోజక వర్గ వైఎస్ఆర్సిపి పరిశీలకులు,పాటి శివకుమార్ గారు తీవ్రంగా ఖండించారు.
ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి,సింహాచలం వంటి దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి పెద్ద దేవాలయాల్లో సైతం ఎక్కువ భక్తులు పోటెత్తేటువంటి దేవాలయాల్లో కూడా సరైన జాగ్రత్తలు తీసుకొని కారణం చేతనే భక్తుల మరణాలు సంభవించాయని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలు సుస్పష్టంగా ప్రజలకు అర్థం అవుతున్న సందర్భంలో ఇటువంటి పరిస్థితులను డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఈ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అలవాటుఅని నిన్న శ్రీకాకుళంలో జరిగిన తొక్కిసలాట లో చనిపోయిన ఉదంతానికి ప్రభుత్వం మీద ప్రజల్లో వచ్చుచున్నటువంటి వ్యతిరేకతను డైవర్ట్ చేయడం కోసం మాజీ మంత్రి, బీసీ నేత జోగి రమేష్ గారిని ఆయనకి సంబంధంలేని నకిలీ మద్యం కేసులో అరెస్టు చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, జరిగిన తప్పుని హుందాతనంగా ఒప్పుకుని భవిష్యత్తులో ఈ పరిస్థితులు రాకుండగా హిందూ ధర్మాన్ని కాపాడతామని చెప్పాల్సిన ప్రభుత్వం ఈ విధమైన రాజకీయాలు చెయ్యడం సిగ్గు చేటు అని,ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి కూడా హిందుత్వంపై, హిందూ దేవాలయాలపై, హిందూ దేవాలయాలకు వెళ్తున్నటువంటి భక్తులపై వీరు చూపిస్తున్న నిర్లక్ష్యానికి ప్రజలు ,భగవంతుడు ఈ ప్రభుత్వానికి శిక్ష వేస్తారని పాటి శివకుమార్ అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.