పున్నమి ప్రతి నిధి
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పై భారత మాజీ ఉప రాష్ట్ర పతి ముప్పు వరపు వెంకయ్య నాయుడు ఘాటు వ్యాఖ్యలుచేశారు.
మహిళలకు ఉచిత బస్సు వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు.
విద్య, వైద్యంపై ఖర్చు చేయాలి కానీ,ఉచితాలు అలవాటు చేయకూడదన్నారు
విద్యతో పేదవాడు సంపన్నుడయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.
వైద్యం ప్రతి మనిషికి అవసరమైందని
ఆర్థిక పరిస్థితిని శ్వేతపత్రం రూపంలో ప్రజలకు తెలపాలన్నారు
ఐదేళ్లలో అప్పులు ఎంత చేస్తున్నారు,ఎంత తిరిగి చెల్లిస్తున్నారన్నది ప్రకటించాలన్నారు
అసెంబ్లీలో బూతుల సాంప్రదాయానికి తెర వేయాలన్నారు.
సభలో లేనివారి పట్ల అమర్యాదగా వ్యవహరించకూడదన్నారు.


