Tuesday, 9 December 2025
  • Home  
  • కూటమి ప్రభుత్వంలో చెరువులకు జలకళ జల హారతి ఇచ్చి పూజలు పాల్గొన్న మేడా
- అన్నమయ్య

కూటమి ప్రభుత్వంలో చెరువులకు జలకళ జల హారతి ఇచ్చి పూజలు పాల్గొన్న మేడా

కూటమి ప్రభుత్వంలో చెరువులకు జలకళ లభించిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి అన్నారు.నందలూరు మండలంలోని ఎర్రచెరువుపల్లి చెరువు అలుగు పొంగడంతో నీటి సంఘం ఉపాధ్యక్షులు సాతపల్లి పిచ్చిరెడ్డి, ఆధ్వర్యంలో అలుగు వద్ద మేడా విజయ శేఖర్ రెడ్డి పూజలు నిర్వహించి జల హారతి ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాకతో చెరువులకు జలకళ ఉట్టిపడుతుందన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా త్రాగు సాగునీటికి ఇబ్బందులు లేకుండా వేల కోట్లు రూపాయలు ఖర్చు చేసి చెరువులకు సాగునీరు అందించాలన్న సంకల్పం నేడు రాష్ట్రవ్యాప్తంగా నెరవేరింది అన్నారు.రైతుల సంక్షేమమే ధ్యేయంగా చెరువులకు నీరుమల్లిచ్చి వారు పంటలు వేసుకునే విధంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.ఐదేళ్లలో చెరువుల అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు.చెరువులు నిండడం ద్వారా అటు సాగునీరు త్రాగునీటికి ఇబ్బందులు ఉండవన్నారు.భూగర్భ జలాలు పెరగడంతో పొలాలన్నీ పచ్చని పైర్లుగా నిండిపోతాయని ఇది కూటమి ప్రభుత్వం యొక్క ఆకాంక్షగా ఆయన అభివర్ణించారు,ఈ కార్యక్రమంలో సాతపల్లి సాయి నర్సారెడ్డి, బైన బోయిన వేణు యాదవ్, నాగ రెడ్డప్ప రెడ్డి, సానం రెడ్డి మహేశ్వర్ రెడ్డి, సాతపల్లి వెంకటసుబ్బారెడ్డి, మరియు మహిళలు గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వంలో చెరువులకు జలకళ లభించిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి అన్నారు.నందలూరు మండలంలోని ఎర్రచెరువుపల్లి చెరువు అలుగు పొంగడంతో నీటి సంఘం ఉపాధ్యక్షులు సాతపల్లి పిచ్చిరెడ్డి, ఆధ్వర్యంలో అలుగు వద్ద మేడా విజయ శేఖర్ రెడ్డి పూజలు నిర్వహించి జల హారతి ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాకతో చెరువులకు జలకళ ఉట్టిపడుతుందన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా త్రాగు సాగునీటికి ఇబ్బందులు లేకుండా వేల కోట్లు రూపాయలు ఖర్చు చేసి చెరువులకు సాగునీరు అందించాలన్న సంకల్పం నేడు రాష్ట్రవ్యాప్తంగా నెరవేరింది అన్నారు.రైతుల సంక్షేమమే ధ్యేయంగా చెరువులకు నీరుమల్లిచ్చి వారు పంటలు వేసుకునే విధంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.ఐదేళ్లలో చెరువుల అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు.చెరువులు నిండడం ద్వారా అటు సాగునీరు త్రాగునీటికి ఇబ్బందులు ఉండవన్నారు.భూగర్భ జలాలు పెరగడంతో పొలాలన్నీ పచ్చని పైర్లుగా నిండిపోతాయని ఇది కూటమి ప్రభుత్వం యొక్క ఆకాంక్షగా ఆయన అభివర్ణించారు,ఈ కార్యక్రమంలో సాతపల్లి సాయి నర్సారెడ్డి, బైన బోయిన వేణు యాదవ్, నాగ రెడ్డప్ప రెడ్డి, సానం రెడ్డి మహేశ్వర్ రెడ్డి,
సాతపల్లి వెంకటసుబ్బారెడ్డి, మరియు మహిళలు గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.