Thursday, 31 July 2025
  • Home  
  • కూటమి పాలనలోనే పేపర్ మిల్లు కార్మికులకు న్యాయం
- తూర్పు గోదావరి

కూటమి పాలనలోనే పేపర్ మిల్లు కార్మికులకు న్యాయం

కూటమి పాలనలోనే పేపరుమిల్లు కార్మికులకు న్యాయం – రూ.5,800 పెంచారు – త్వరలో మంచి అగ్రిమెంటు, ఎన్నికలు జరుగుతాయి – ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కృషి ఫలిస్తుంది – వైసీపీ పాలనలోనే ఆ‌ నాయకులు ఏమీ చేయలేకపోయారు – వైసీపీ వర్గపోరుతో కార్మికులకు నష్టం జరిగిందని అందరికీ తెలుసు – ఇప్పుడొచ్చి గొప్పలు చెప్పుకోవద్దు – మిల్లు కార్మికులకు జీతాలు ఎక్కువని నాడు జగన్ అనడం మరిచారా? – సమ్మె చేస్తే మిల్లు మూసేస్తారని కార్మికులను జగన్ భయపెట్టారుకదా – మండిపడిన మిల్లు కార్మిక సంఘాల నాయకులు రాజమహేంద్రవరం: వైసీపీ పాలనలో నష్టపోయిన పేపరుమిల్లు కార్మికులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే న్యాయం చేసిందని మాజీ కార్పొరేటర్ మొకమాటి సత్యనారాయణ చెప్పారు. సోమవారం ఆయన మిల్లు కార్మికు సంఘాల నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మిల్లు కార్మికులకు అగ్రిమెంట్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని,వారి వర్గపోరుతో కార్మికులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్ తదితరులు మిల్లు కార్మికుల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రిన్సిపాల్ సెక్రటరీ దృష్టికి తీసుకు వెళ్లి వారికి న్యాయం జరిగేలా కృషి చేశారని ఆయన అన్నారు. త్వరలో మిల్లు గుర్తింపు యూనియన్ ఎన్నికలు,మంచి అగ్రిమెంట్ కూడా జరుగుతుందని ఆయన తెలిపారు.ఎప్పుడైనా టీడీపీ హయాంలోనే మిల్లు కార్మికులకు మంచి అగ్రిమెంట్ జరిగిందని, ఎన్నికలు కూడా జరిగాయని ఆయన అన్నారు. వైసీపీ నాయకుల మధ్య విభేదాలు పేపరుమిల్లు కార్మికులకు నష్టం కలిగించాయని, దీక్షలు పేరిట ఒక వర్గం నాయకులు కూర్చోవడం లేచిపోవడం వెంటవెంటనే జరిగేవని, కార్మికులకు అప్పుడు, ఇప్పుడు కూటమి వైసీపీ నాయకులవల్ల ఎలాంటి మేలు జరగలేదని మొకమాటి సత్యనారాయణ స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు సూట్ కేస్ నాయకులని, కూటమి ప్రజాప్రతినిధులు అలా ఎప్పుడూ సూట్ కేసులకు ఆశపడరని ఆయన అన్నారు. మిల్లు సీఎస్సార్ నిధులు నగరంలో అభివృద్ధి పనులకు ఖర్చు చేసే విధంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కృషి చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ సంగతి ప్రజలకు, మిల్లు కార్మికులకు తెలుసని ఆయన అన్నారు. కార్మిక నాయకుడు దుత్తరపు గంగాధర్ మాట్లాడుతూ ఐదేళ్ళ వైసీపీ పాలనలో కార్మికులకు ఎలాంటి అగ్రిమెంట్ చేయలేక పోయొరని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కార్మికులకు రూ.5,800 జీతం పెంచిందని ఇదంతా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి,మంత్రి కందుల దుర్గేష్ చొరవతో జరిగిందని అన్నారు. తాము ధర్నాలు, దీక్ష చేయడంవల్లే జరిగిందని వైసీపీ నాయకులు చెప్పుకోవడం హాస్యాస్పదమని, అలాగైతే వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఎందుకు చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు. వైసీపీ పాలనలో వర్గపోరులో నష్టపోయిన కార్మికులకు నాడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న ఆదిరెడ్డి శ్రీనివాస్, కందుల దుర్గేష్, తదితరులు తాము అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, అందుకు తగినట్లుగానే కార్మికులకు వేతనాలు పెంపు జరిగిందని, వైసీపీ నాయకుల వల్ల కాదని ఆయన అన్నారు. ఎస్.కె.ఎస్.కార్మిక సంఘం నాయకుడు ప్రకాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మంత్రి కందుల దుర్గేష్ వల్ల కార్మికులకు రూ.5,800 జీతం పెరిగిందని, త్వరలో మంచి అగ్రిమెంట్ జరుగుతుందని అన్నారు.వైసీపీ నాయకులు చేసిందేమి లేదని ఆయన స్పష్టం చేశారు. 2024 ఏప్రిల్ లో తాము సమ్మె చేస్తుంటే ఎన్నికల ప్రచారానికి వచ్చిన జగన్ కార్మిక నాయకులను తన బస్సులోకి పిలిచి మిల్లు కార్మికులకు ఇప్పటికే జీతాలు ఎక్కువ అని, సమ్మె చేస్తే మిల్లు మూసేస్తారని అనడం వైసీపీ నాయకులకు గుర్తు లేదా అని ప్రశ్నించారు.వైసీపీ నాయకుల వల్ల ఏమీ ప్రయోజనం లేదని, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎంపీ పురంధేశ్వరి మంత్రి కందుల దుర్గేష్ కృషి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల ఈ జీతాలు పెరిగాయని, ఆయన తెలిపారు.వైసీపీ నాయకుల ధర్నాల వల్ల జరిగిందని చెప్పుకోవడ తగదని‌ ప్రకాష్ హితవు పలికారు.కార్మికులకు మూడు సంవత్సరాల ఆరు నెలలకు ఒకసారి అగ్రిమెంట్ జరగాలని, 2019 లో అప్పటి మంత్రి పితాని సత్యనారాయణ హయాంలో అగ్రిమెంట్ చేశారని తర్వాత వచ్చిన వైసీపీ పాలనలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కార్మికులను గాలికి వదిలేశారని, పరంపర కార్మికులకు కూడా న్యాయం చేయలేక పోయారని ఆయన విమర్శించారు.కూటమి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పరంపర కార్మికులకు కూడా న్యాయం చేశారని ఆయన చెప్పారు. మీడియా సమావేశంలో మిల్లు టిఎన్టీయూసీ ప్రెసిడెంట్ ఎం బోసు, కార్యదర్శి కె రమణ రావు, కార్మికులు కళ్యాణ్, సురేష్, ఎన్ విజయ్, అశోక్, ఏం మహేష్ తదితరులు పాల్గొన్నారు.

కూటమి పాలనలోనే పేపరుమిల్లు కార్మికులకు న్యాయం
– రూ.5,800 పెంచారు
– త్వరలో మంచి అగ్రిమెంటు, ఎన్నికలు జరుగుతాయి
– ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కృషి ఫలిస్తుంది
– వైసీపీ పాలనలోనే ఆ‌ నాయకులు ఏమీ చేయలేకపోయారు
– వైసీపీ వర్గపోరుతో కార్మికులకు నష్టం జరిగిందని అందరికీ తెలుసు
– ఇప్పుడొచ్చి గొప్పలు చెప్పుకోవద్దు
– మిల్లు కార్మికులకు జీతాలు ఎక్కువని నాడు జగన్ అనడం మరిచారా?
– సమ్మె చేస్తే మిల్లు మూసేస్తారని కార్మికులను జగన్ భయపెట్టారుకదా
– మండిపడిన మిల్లు కార్మిక సంఘాల నాయకులు
రాజమహేంద్రవరం:
వైసీపీ పాలనలో నష్టపోయిన పేపరుమిల్లు కార్మికులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే న్యాయం చేసిందని మాజీ కార్పొరేటర్ మొకమాటి సత్యనారాయణ చెప్పారు. సోమవారం ఆయన మిల్లు కార్మికు సంఘాల నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మిల్లు కార్మికులకు అగ్రిమెంట్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని,వారి వర్గపోరుతో కార్మికులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్ తదితరులు మిల్లు కార్మికుల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రిన్సిపాల్ సెక్రటరీ దృష్టికి తీసుకు వెళ్లి వారికి న్యాయం జరిగేలా కృషి చేశారని ఆయన అన్నారు. త్వరలో మిల్లు గుర్తింపు యూనియన్ ఎన్నికలు,మంచి అగ్రిమెంట్ కూడా జరుగుతుందని ఆయన తెలిపారు.ఎప్పుడైనా టీడీపీ హయాంలోనే మిల్లు కార్మికులకు మంచి అగ్రిమెంట్ జరిగిందని, ఎన్నికలు కూడా జరిగాయని ఆయన అన్నారు. వైసీపీ నాయకుల మధ్య విభేదాలు పేపరుమిల్లు కార్మికులకు నష్టం కలిగించాయని, దీక్షలు పేరిట ఒక వర్గం నాయకులు కూర్చోవడం లేచిపోవడం వెంటవెంటనే జరిగేవని, కార్మికులకు అప్పుడు, ఇప్పుడు కూటమి వైసీపీ నాయకులవల్ల ఎలాంటి మేలు జరగలేదని మొకమాటి సత్యనారాయణ స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు సూట్ కేస్ నాయకులని, కూటమి ప్రజాప్రతినిధులు అలా ఎప్పుడూ సూట్ కేసులకు ఆశపడరని ఆయన అన్నారు. మిల్లు సీఎస్సార్ నిధులు నగరంలో అభివృద్ధి పనులకు ఖర్చు చేసే విధంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కృషి చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ సంగతి ప్రజలకు, మిల్లు కార్మికులకు తెలుసని ఆయన అన్నారు. కార్మిక నాయకుడు దుత్తరపు గంగాధర్ మాట్లాడుతూ ఐదేళ్ళ వైసీపీ పాలనలో కార్మికులకు ఎలాంటి అగ్రిమెంట్ చేయలేక పోయొరని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కార్మికులకు రూ.5,800 జీతం పెంచిందని ఇదంతా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి,మంత్రి కందుల దుర్గేష్ చొరవతో జరిగిందని అన్నారు. తాము ధర్నాలు, దీక్ష చేయడంవల్లే జరిగిందని వైసీపీ నాయకులు చెప్పుకోవడం హాస్యాస్పదమని, అలాగైతే వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఎందుకు చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు. వైసీపీ పాలనలో వర్గపోరులో నష్టపోయిన కార్మికులకు నాడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న ఆదిరెడ్డి శ్రీనివాస్, కందుల దుర్గేష్, తదితరులు తాము అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, అందుకు తగినట్లుగానే కార్మికులకు వేతనాలు పెంపు జరిగిందని, వైసీపీ నాయకుల వల్ల కాదని ఆయన అన్నారు. ఎస్.కె.ఎస్.కార్మిక సంఘం నాయకుడు ప్రకాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మంత్రి కందుల దుర్గేష్ వల్ల కార్మికులకు రూ.5,800 జీతం పెరిగిందని, త్వరలో మంచి అగ్రిమెంట్ జరుగుతుందని అన్నారు.వైసీపీ నాయకులు చేసిందేమి లేదని ఆయన స్పష్టం చేశారు. 2024 ఏప్రిల్ లో తాము సమ్మె చేస్తుంటే ఎన్నికల ప్రచారానికి వచ్చిన జగన్ కార్మిక నాయకులను తన బస్సులోకి పిలిచి మిల్లు కార్మికులకు ఇప్పటికే జీతాలు ఎక్కువ అని, సమ్మె చేస్తే మిల్లు మూసేస్తారని అనడం వైసీపీ నాయకులకు గుర్తు లేదా అని ప్రశ్నించారు.వైసీపీ నాయకుల వల్ల ఏమీ ప్రయోజనం లేదని, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎంపీ పురంధేశ్వరి మంత్రి కందుల దుర్గేష్ కృషి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల ఈ జీతాలు పెరిగాయని, ఆయన తెలిపారు.వైసీపీ నాయకుల ధర్నాల వల్ల జరిగిందని చెప్పుకోవడ తగదని‌ ప్రకాష్ హితవు పలికారు.కార్మికులకు మూడు సంవత్సరాల ఆరు నెలలకు ఒకసారి అగ్రిమెంట్ జరగాలని, 2019 లో అప్పటి మంత్రి పితాని సత్యనారాయణ హయాంలో అగ్రిమెంట్ చేశారని తర్వాత వచ్చిన వైసీపీ పాలనలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కార్మికులను గాలికి వదిలేశారని, పరంపర కార్మికులకు కూడా న్యాయం చేయలేక పోయారని ఆయన విమర్శించారు.కూటమి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పరంపర కార్మికులకు కూడా న్యాయం చేశారని ఆయన చెప్పారు. మీడియా సమావేశంలో మిల్లు టిఎన్టీయూసీ ప్రెసిడెంట్ ఎం బోసు, కార్యదర్శి కె రమణ రావు, కార్మికులు కళ్యాణ్, సురేష్, ఎన్ విజయ్, అశోక్, ఏం మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.