అమలాపురం, అక్టోబరు 05 (పున్నమి ప్రతినిధి) :
క్రీడా మైదానంలో జరిగిన ఎస్ జి ఎఫ్ఐ కుస్తీ పోటీల్లో అండర్ 17 విభాగం ఫ్రీ స్టైల్ అండ్ గ్రీకో రోమన్ పోటీల్లో అమలాపురం రూరల్ మండలం పేరూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు దాసరి సాయికుమార్, ఆకుమర్తి సుదీప్ లు విశేష ప్రతిభ కనబరిచారు. 10వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థులు పోటీల్లో తమ సత్తా చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు పెచ్చెట్టి రామకృష్ణ తెలిపారు. ఈ విజేతలను గ్రామ సర్పంచ్ దాసరి అరుణా డేవిడ్, ప్రధానోపాధ్యాయురాలు ఎన్ విజయ కుమారి, ఎస్ఎంసీ చైర్మన్ కెవివి సత్యనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు రామకృష్ణ, కమిటీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

కుస్తీ పోటీల్లో పేరూరు హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ… రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
అమలాపురం, అక్టోబరు 05 (పున్నమి ప్రతినిధి) : క్రీడా మైదానంలో జరిగిన ఎస్ జి ఎఫ్ఐ కుస్తీ పోటీల్లో అండర్ 17 విభాగం ఫ్రీ స్టైల్ అండ్ గ్రీకో రోమన్ పోటీల్లో అమలాపురం రూరల్ మండలం పేరూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు దాసరి సాయికుమార్, ఆకుమర్తి సుదీప్ లు విశేష ప్రతిభ కనబరిచారు. 10వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థులు పోటీల్లో తమ సత్తా చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు పెచ్చెట్టి రామకృష్ణ తెలిపారు. ఈ విజేతలను గ్రామ సర్పంచ్ దాసరి అరుణా డేవిడ్, ప్రధానోపాధ్యాయురాలు ఎన్ విజయ కుమారి, ఎస్ఎంసీ చైర్మన్ కెవివి సత్యనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు రామకృష్ణ, కమిటీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

