Sunday, 7 December 2025
  • Home  
  • *కులం పేరుతో దూషించిన వ్యక్తిపై వెంటనే కేసు నమోదు చేయాలి.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*కులం పేరుతో దూషించిన వ్యక్తిపై వెంటనే కేసు నమోదు చేయాలి.

*కులం పేరుతో దూషించిన వ్యక్తిపై వెంటనే కేసు నమోదు చేయాలి…* *లేనిపక్షంలో చలో పొదలకూరుకు పిలుపునిస్తాం…* *ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్..* *పొదలకూరు*: పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఎమ్మార్పీఎస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు సూరి పాక ఉదయ్ కృష్ణ మాదిగ మాట్లాడుతూ పొదలకూరు పట్టణంలో మాదిగ సోదరుడైన వేమయ్యా సరియు హీరో హోండా షోరూమ్ నడుపుకుంటూ జీవనాధారం సాగిస్తున్నారని గూడూరు కి చెందిన విశ్వ సాయి హీరో షోరూం నుంచి టూ వీలర్స్ ని తీసుకుని వచ్చి విక్రయాలు సాగించేవాడని , ఈ క్రమంలో గూడూరు నుంచి తీసుకొచ్చే టూ వీలర్స్ వాహనాల, ట్రాన్స్పోర్ట్ మరియు కస్టమర్లకు ఇచ్చే ఆఫర్లు పోగా ఆదాయం రాకపోవడంతో నెల్లూరుకు చెందిన సరయు హోండా షోరూం నుంచి ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసి విక్రయించడం ప్రారంభించాడని , గూడూరు లో ఉన్న విశ్వ సాయి హోండా షోరూం వారు ఇచ్చే మార్జిన్ కంటే నెల్లూరు సరయు వారు ఇచ్చే వాహనాలపై ఇచ్చే మార్జిన్ ఎక్కువ ఉండటంతో నెల్లూరులో కొనుగోలు చేయడం ప్రారంభించారని, గూడూరులో తన వద్ద కొనడం లేదు అని కక్ష పెట్టుకుని గత నెల 24వ తేదీ గూడూరు కు చెందిన షోరూం యజమాని పొదలకూరులోని సరియో హోండా షోరూం కి చేరుకొని వేమయ్య లేని సమయంలో తమ సిబ్బందితో అసభ్య పదజాలం వాడుతూ భయబ్రాంతులకు గురి చేస్తూ కొత్త ద్విచక్ర వాహనాల తాళాలను తీసుకొని వెళ్తూ, వేమయ్య పై అసభ్య పదజాలం వాడుతూ , కులం పేరుతో దూషించి అక్కడ నుంచి వెళ్లిపోయాదని షోరూం సిబ్బంది ఇచ్చిన సమాచారంతో షోరూం కు చేరుకున్న వేమయ్య స్థానిక పోలీస్ స్టేషన్లో గూడూరు కు చెందిన విశ్వ సాయి హోండా షోరూం యజమానిపై ఫిర్యాదు చేయగా సుమారు నెలకావస్తున్న అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయము డీఎస్పీ దృష్టికి కూడా తీసుకువెళ్లామని,కావున ఇప్పటికైనా పొదలకూరు పోలీస్ వారు వెంటనే అతనిపై కేసు నమోదు చేసి వేమయ్య కు న్యాయం చేయవలసిందిగా, లేని పక్షంలో దళిత సోదరులంతా కలిసి తమ నాయకుడు మందకృష్ణ మాదిగ సూచనలతో చలో పొదలకూరు అనే కార్యక్రమంతో పిలుపునిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గొల్లపల్లి శ్రీనివాస మాదిగ ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు, పందింటి అంబేద్కర్ మాదిగ ఎం ఎస్ పి నెల్లూరు జిల్లా అధ్యక్షులు, వెంకటేశ్వర్లు మాదిగ ఎంఎస్పి రాష్ట్ర నాయకులు, వేగూరు వెంకటేశ్వర్లు ఎంఈఎఫ్ రాష్ట్ర నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు..

*కులం పేరుతో దూషించిన వ్యక్తిపై వెంటనే కేసు నమోదు చేయాలి…*

*లేనిపక్షంలో చలో పొదలకూరుకు పిలుపునిస్తాం…*

*ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్..*

*పొదలకూరు*: పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఎమ్మార్పీఎస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు సూరి పాక ఉదయ్ కృష్ణ మాదిగ మాట్లాడుతూ పొదలకూరు పట్టణంలో మాదిగ సోదరుడైన వేమయ్యా సరియు హీరో హోండా షోరూమ్ నడుపుకుంటూ జీవనాధారం సాగిస్తున్నారని గూడూరు కి చెందిన విశ్వ సాయి హీరో షోరూం నుంచి టూ వీలర్స్ ని తీసుకుని వచ్చి విక్రయాలు సాగించేవాడని , ఈ క్రమంలో గూడూరు నుంచి తీసుకొచ్చే టూ వీలర్స్ వాహనాల, ట్రాన్స్పోర్ట్ మరియు కస్టమర్లకు ఇచ్చే ఆఫర్లు పోగా ఆదాయం రాకపోవడంతో నెల్లూరుకు చెందిన సరయు హోండా షోరూం నుంచి ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసి విక్రయించడం ప్రారంభించాడని , గూడూరు లో ఉన్న విశ్వ సాయి హోండా షోరూం వారు ఇచ్చే మార్జిన్ కంటే నెల్లూరు సరయు వారు ఇచ్చే వాహనాలపై ఇచ్చే మార్జిన్ ఎక్కువ ఉండటంతో నెల్లూరులో కొనుగోలు చేయడం ప్రారంభించారని, గూడూరులో తన వద్ద కొనడం లేదు అని కక్ష పెట్టుకుని గత నెల 24వ తేదీ గూడూరు కు చెందిన షోరూం యజమాని పొదలకూరులోని సరియో హోండా షోరూం కి చేరుకొని వేమయ్య లేని సమయంలో తమ సిబ్బందితో అసభ్య పదజాలం వాడుతూ భయబ్రాంతులకు గురి చేస్తూ కొత్త ద్విచక్ర వాహనాల తాళాలను తీసుకొని వెళ్తూ, వేమయ్య పై అసభ్య పదజాలం వాడుతూ , కులం పేరుతో దూషించి అక్కడ నుంచి వెళ్లిపోయాదని షోరూం సిబ్బంది ఇచ్చిన సమాచారంతో షోరూం కు చేరుకున్న వేమయ్య స్థానిక పోలీస్ స్టేషన్లో గూడూరు కు చెందిన విశ్వ సాయి హోండా షోరూం యజమానిపై ఫిర్యాదు చేయగా సుమారు నెలకావస్తున్న అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయము డీఎస్పీ దృష్టికి కూడా తీసుకువెళ్లామని,కావున ఇప్పటికైనా పొదలకూరు పోలీస్ వారు వెంటనే అతనిపై కేసు నమోదు చేసి వేమయ్య కు న్యాయం చేయవలసిందిగా, లేని పక్షంలో దళిత సోదరులంతా కలిసి తమ నాయకుడు మందకృష్ణ మాదిగ సూచనలతో చలో పొదలకూరు అనే కార్యక్రమంతో పిలుపునిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గొల్లపల్లి శ్రీనివాస మాదిగ ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు, పందింటి అంబేద్కర్ మాదిగ ఎం ఎస్ పి నెల్లూరు జిల్లా అధ్యక్షులు, వెంకటేశ్వర్లు మాదిగ ఎంఎస్పి రాష్ట్ర నాయకులు, వేగూరు వెంకటేశ్వర్లు ఎంఈఎఫ్ రాష్ట్ర నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.