కురుపాం గురుకుల పాఠశాల విద్యార్థులు గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురై కేజీహెచ్‌లో చికిత్స పొందారు. వారికి వైద్యసేవలను సమర్ధంగా అందించి, ఆరోగ్యవంతులుగా మార్చిన వైద్య సిబ్బందికి, ఆరోగ్య శాఖ అధికారులకు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈరోజు ఆ ఆరుగురు గిరిజన విద్యార్థులను సురక్షితంగా ప్రభుత్వ అంబులెన్స్ ద్వారా వారి ఇళ్లకు పంపించారు.
ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ మాట్లాడుతూ, “ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యంపై చూపిన శ్రద్ధ అభినందనీయం. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి సకాల వైద్యసేవలు అందించడంలో ప్రభుత్వం మరింత ముందడుగు వేయాలి” అన్నారు.

కురుపాం గురుకుల విద్యార్థులకు మెరుగైన వైద్యం — సీఎం, ఆరోగ్యశాఖకు కృతజ్ఞతలు
కురుపాం గురుకుల పాఠశాల విద్యార్థులు గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురై కేజీహెచ్‌లో చికిత్స పొందారు. వారికి వైద్యసేవలను సమర్ధంగా అందించి, ఆరోగ్యవంతులుగా మార్చిన వైద్య సిబ్బందికి, ఆరోగ్య శాఖ అధికారులకు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఆ ఆరుగురు గిరిజన విద్యార్థులను సురక్షితంగా ప్రభుత్వ అంబులెన్స్ ద్వారా వారి ఇళ్లకు పంపించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ మాట్లాడుతూ, “ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యంపై చూపిన శ్రద్ధ అభినందనీయం. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి సకాల వైద్యసేవలు అందించడంలో ప్రభుత్వం మరింత ముందడుగు వేయాలి” అన్నారు.

