పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు(సెప్టెంబర్22)
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో విజయదుర్గ అమ్మవారి 14వ వార్షికోత్సవాలు ఘనంగా జరుపుకున్నాయి. వాటర్ ట్యాంక్ వీధిలోని మండపంలో పురోహితుడు వెలవెల పల్లి ప్రకాశరావు వేద మంత్రాలతో విగ్రహ ప్రతిష్ట చేశారు. విగ్రహ దాత వీర్రాజు దంపతులు, కుటుంబ సభ్యులు వైభవంగా కార్యక్రమాన్ని నిర్వాహించారు. అమ్మవారిని ఊరేగింపుగా గ్రామంలో తీసుకువచ్చి మండపంలో ప్రతిష్టించారు. కుల మతాలకు అతీతంగా మహిళా భక్తులు పెద్దఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. 14 సంవత్సరాల క్రితం చిన్నపిల్లలచే ప్రారంభమైన ఈ మహోత్సవాలు అమ్మవారి దయతో ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రత్యేకతగా, చీరను వేలం పాటలో భక్తులు గెలిచి కోరికలు నెరవేరాలని నమ్మకం ఉంది


