संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
नारायणपेट

కున్సిలో ఘనంగా చివరి రోజు బతుకమ్మ సంబరాలు పోటాపోటీగా బతుకమ్మల తయారీ..

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
కున్సిలో ఘనంగా చివరి రోజు బతుకమ్మ సంబరాలు పోటాపోటీగా బతుకమ్మల తయారీ..

खबर की मुख्य बातें

  • కృష్ణ మండలం, కున్సి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ చివరి రోజు సంబరాలు కృష్ణ మండలం కున్సి గ్రామంలో ఘనంగా నిర్వహించారు.
  • గ్రామంలోని మారెమ్మ దేవి ఆలయం వద్ద నిర్వహించిన ఈ వేడుకలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.
  • గ్రామంలోని ఆడపడుచులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు.

కృష్ణ మండలం, కున్సి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ చివరి రోజు సంబరాలు కృష్ణ మండలం కున్సి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మారెమ్మ దేవి ఆలయం వద్ద నిర్వహించిన ఈ వేడుకలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. గ్రామంలోని ఆడపడుచులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను తయారు చేసుకొని పోటాపోటీగా ఆలయం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం అందరూ కలిసి బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయబద్ధంగా బొడ్డెమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. మహిళల కోలాటాలు, పాటలు, బతుకమ్మల అందాలతో మారెమ్మ దేవి ఆలయం పరిసరాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. గ్రామంలో మహిళలంతా ఒకచోట చేరి ఐకమత్యంతో పండుగను జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
బతుకమ్మలను అందంగా అలంకరించి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు బహుమతులు అందజేశారు. మహిళలను ప్రోత్సహిస్తూ బహుమతులు అందించడం పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేకలి సురేష్, ఉపసర్పంచ్ రాము, మాజీ సర్పంచ్ సోమశేఖర్ గౌడ్, బీజేపీ మండల అధ్యక్షుడు నల్లె నర్సప్ప, మాస్టర్ రామచంద్ర, ఉప్పరి మహదేవ్, పూజారి మోనప్ప, పల్దొడ్డి శరణప్ప గౌడ్‌తో పాటు గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *