संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
नारायणपेट

కున్సి దేవమవ్వ ఆలయం వద్ద ఘనంగా 9వ రోజు బతుకమ్మ సంబురాలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
కున్సి దేవమవ్వ ఆలయం వద్ద ఘనంగా 9వ రోజు బతుకమ్మ సంబురాలు

खबर की मुख्य बातें

  • కృష్ణ మండలం కున్సి గ్రామంలోని దేవమవ్వ ఆలయం వద్ద 9వ రోజు బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి.
  • మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలతో సందడి చేశారు.
  • రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, పోటాపోటీగా తయారు చేసుకుని వేడుకలకు తీసుకువచ్చారు.

కృష్ణ మండలం కున్సి గ్రామంలోని దేవమవ్వ ఆలయం వద్ద 9వ రోజు బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలతో సందడి చేశారు. రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, పోటాపోటీగా తయారు చేసుకుని వేడుకలకు తీసుకువచ్చారు. దీంతో ఆలయ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
తొమ్మిది రోజులపాటు నిర్వహించిన బతుకమ్మ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళలు భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను పూజిస్తూ, పాటలు పాడుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మలను అందంగా తయారు చేసిన మహిళలకు బహుమతులు అందజేశారు. అలాగే తొమ్మిది రోజులపాటు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, సర్పంచ్, మాజీ సర్పంచ్, అఖిలపక్ష నాయకులు, సీనియర్ నాయకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలో బతుకమ్మ సంబురాలు సంప్రదాయబద్ధంగా, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *