संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
नारायणपेट

ఖాన్ దొడ్డి గ్రామానికి 11 ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేత

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఖాన్ దొడ్డి గ్రామానికి 11 ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేత

खबर की मुख्य बातें

  • కృష్ణ మండలం: మక్తల్ నియోజకవర్గం, కృష్ణ మండల పరిధిలోని ఖాన్ దొడ్డి గ్రామానికి మంజూరైన 11 ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్‌ను సోమవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద లబ్ధిదారులకు అందజేశారు.
  • కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా అర్హులైన పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
  • ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ..

కృష్ణ మండలం: మక్తల్ నియోజకవర్గం, కృష్ణ మండల పరిధిలోని ఖాన్ దొడ్డి గ్రామానికి మంజూరైన 11 ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్‌ను సోమవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద లబ్ధిదారులకు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా అర్హులైన పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే కలను సాకారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేద కుటుంబాలకు సొంత ఇంటి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విజయప్పగౌడ్, సర్పంచ్ సంగోల వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి శివరాజ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంతోష్, వెంకటేష్, రాకేష్, మల్లికార్జున్, సుదర్శన్‌తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, స్థానిక మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరికి లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *