संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
नारायणपेट

క్రిష్ణ మండలంలోని వివిధ గ్రామాల్లో బీజేపీ ఆధ్వర్యంలో జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
క్రిష్ణ మండలంలోని వివిధ గ్రామాల్లో బీజేపీ ఆధ్వర్యంలో జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు

खबर की मुख्य बातें

  • క్రిష్ణ మండలం: మండలంలోని వివిధ గ్రామాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమం బీజేపీ ఆధ్వర్యంలో జోరుగా కొనసాగుతోంది.
  • ఇందులో భాగంగా హిందూపూర్, చెగుంటా, ఆలంపల్లి గ్రామాల్లో బీజేపీ మండల అధ్యక్షుడు నల్లె నర్సప్ప, ప్రధాన కార్యదర్శి దండు రాఘవేంద్ర ఆధ్వర్యంలో నాయకులు ఇంటింటికీ వెళ్లి పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.
  • ఈ సందర్భంగా నాయకులు పట్టభద్రుల ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ, అర్హులైన విద్యావంతులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.

క్రిష్ణ మండలం: మండలంలోని వివిధ గ్రామాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమం బీజేపీ ఆధ్వర్యంలో జోరుగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా హిందూపూర్, చెగుంటా, ఆలంపల్లి గ్రామాల్లో బీజేపీ మండల అధ్యక్షుడు నల్లె నర్సప్ప, ప్రధాన కార్యదర్శి దండు రాఘవేంద్ర ఆధ్వర్యంలో నాయకులు ఇంటింటికీ వెళ్లి పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు పట్టభద్రుల ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ, అర్హులైన విద్యావంతులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని, విద్యావంతులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో భాగస్వాములు కావాలని తెలిపారు.
మండలంలోని వివిధ గ్రామాల్లో పట్టభద్రులను కలిసి ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన పట్టభద్రులు ఎవరూ ఓటరు నమోదును నిర్లక్ష్యం చేయకుండా, నిర్ణీత ప్రక్రియ ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కుపై అవగాహన కల్పించి, అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు అయ్యేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు గురూపు మల్లేష్, గౌరీశంకర్, ప్యాట్ల సిద్ధప్ప, మహేష్, ఈశప్ప, వడ్ల మారెప్ప, సుధాకర్ రెడ్డి గౌడ, రమేష్ గౌడ, భగవాన్, కండ్రాయ రాజు, యాంకప్ప గౌడ, చారంబాబు, కావాలి బస్వరాజు, అంబ్రెస్, కట్ల తయప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *