పున్నమి ప్రతినిధి
కుక్క కాటుతో సంభవించే రేబీస్ వ్యాధి చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ లక్షణాలు (జ్వరం, తలనొప్పి, బలహీనత, నీటిని చూసి భయపడటం) కనిపిస్తే రక్షించడం అసాధ్యమని పేర్కొంటున్నారు. కుక్క కాటు వేసిన వెంటనే ఆలస్యం చేయకుండా వ్యాక్సిన్లు వేయించుకోవాలని సూచించారు. పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్లు వేయాలని సూచిస్తున్నారు. కుక్క గోరు గుచ్చుకున్నా నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు.


