Thursday, 5 February 2026
  • Home  
  • కీమోతో జుట్టు రాలకుండా..
- హెల్త్ టిప్స్

కీమోతో జుట్టు రాలకుండా..

ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి : క్యాన్సర్ చికిత్సల్లో కీమోథెరపీతో జుట్టు రాలుతుంటుంది. చికిత్స అనంతరం వెంట్రుకలు తిరిగి మొలిచినప్పటికీ కీమోథెరపీ తీసుకునేవారికి జుట్టు రాలటం చాలా ఆందోళన కలిగిస్తుంది. కొన్నిసార్లు ఆత్మ విశ్వాసాన్నీ దెబ్బతీస్తుంది. అందుకే వెంట్రుకలు రాలకుండా చూడటానికి చల్లటి టోపీ (కోల్డ్ క్యాప్) చికిత్స వాడుతుంటారు. దీన్ని స్కాల్ప్ కూలింగ్ అనీ పిలుస్తుంటారు. ఇది చల్లదనం ద్వారా మాడులోని రక్తనాళాలను సంకోచించేలా చేస్తుంది. ఇలా వెంట్రుకల కుదుళ్లకు కీమో మందు అంత ఎక్కువగా చేరకుండా అడ్డుకుంటుంది. అలాగని అసలే వెంట్రుకలు రాలవని కాదు గానీ కొంతవరకు తగ్గుతుంది. రెండు రకాలు ఆటోమేటెడ్ టోపీలు: చికిత్స తీసుకుంటున్నప్పుడు వీటిల్లో గొట్టం ద్వారా చల్లటి నీరు ప్రసారమవుతుంది. ఫ్రొజెన్ జెల్ టోపీలు: వీటిల్లో గొట్టానికి బదులు డ్రై ఐస్ ఉంటుంది. ఇది చికిత్స చేస్తున్నప్పుడు తిరుగుతూ చల్లగా ఉండేలా చేస్తుంది. ఏది వాడుకోవాలనేది వ్యక్తిగత నిర్ణయమే. ధర, సౌకర్యం బట్టి ఎవరికి వారే ఎంచుకోవచ్చు. ఎంత చల్లన? చల్లటి టోపీల్లో ప్రసరించే ద్రవం సుమారు 2 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలో ఉంటుంది. ఇది మాడును 18 నుంచి 22 డిగ్రీల సెల్షియస్ మధ్యలో చల్లగా ఉండేలా చూస్తుంది. ఎప్పుడు మొదలెట్టాలి? కీమోథెరపీ తీసుకోవటానికి 30-60 నిమిషాల ముందే చల్లటి టోపీ ధరించాలి. చికిత్స అనంతరమూ 30-60 నిమిషాల సేపు అలాగే ఉంచాలి. తొలిసారి రేడియేషన్ తీసుకుంటున్నప్పటి నుంచే వీటిని వాడుకోవాలి. కీమోతో జుట్టు రాలటమనేది తొలిసారి చికిత్స తర్వాతే మొదలవుతుంది. ఎవరికి సరిపోతాయి? చల్లటి టోపీలు అందరికీ సరిపడవు. కొన్ని కీమో మందులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇవి స్వల్పంగా చేరినా వెంట్రుకల కుదుళ్లు దెబ్బతింటాయి. రక్త, మెదడు క్యాన్సర్లు.. పార్శ్వనొప్పి, కాలేయ జబ్బు గలవారు.. ఎముకమజ్జ మార్పిడికి సిద్ధమయ్యేవారు, 18 ఏళ్లలోపు వారికి ఈ టోపీలు వద్దు.

ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి :
క్యాన్సర్ చికిత్సల్లో కీమోథెరపీతో జుట్టు రాలుతుంటుంది. చికిత్స అనంతరం వెంట్రుకలు తిరిగి మొలిచినప్పటికీ కీమోథెరపీ తీసుకునేవారికి జుట్టు రాలటం చాలా ఆందోళన కలిగిస్తుంది. కొన్నిసార్లు ఆత్మ విశ్వాసాన్నీ దెబ్బతీస్తుంది. అందుకే వెంట్రుకలు రాలకుండా చూడటానికి చల్లటి టోపీ (కోల్డ్ క్యాప్) చికిత్స వాడుతుంటారు. దీన్ని స్కాల్ప్ కూలింగ్ అనీ పిలుస్తుంటారు. ఇది చల్లదనం ద్వారా మాడులోని రక్తనాళాలను సంకోచించేలా చేస్తుంది. ఇలా వెంట్రుకల కుదుళ్లకు కీమో మందు అంత ఎక్కువగా చేరకుండా అడ్డుకుంటుంది. అలాగని అసలే వెంట్రుకలు రాలవని కాదు గానీ కొంతవరకు తగ్గుతుంది.

రెండు రకాలు
ఆటోమేటెడ్ టోపీలు: చికిత్స తీసుకుంటున్నప్పుడు

వీటిల్లో గొట్టం ద్వారా చల్లటి నీరు ప్రసారమవుతుంది.

ఫ్రొజెన్ జెల్ టోపీలు: వీటిల్లో గొట్టానికి బదులు డ్రై

ఐస్ ఉంటుంది. ఇది చికిత్స చేస్తున్నప్పుడు తిరుగుతూ చల్లగా ఉండేలా చేస్తుంది.

ఏది వాడుకోవాలనేది వ్యక్తిగత నిర్ణయమే. ధర, సౌకర్యం బట్టి ఎవరికి వారే ఎంచుకోవచ్చు.

ఎంత చల్లన?
చల్లటి టోపీల్లో ప్రసరించే ద్రవం సుమారు 2 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలో ఉంటుంది. ఇది మాడును 18 నుంచి 22 డిగ్రీల సెల్షియస్ మధ్యలో చల్లగా ఉండేలా చూస్తుంది.

ఎప్పుడు మొదలెట్టాలి?
కీమోథెరపీ తీసుకోవటానికి 30-60 నిమిషాల ముందే చల్లటి టోపీ ధరించాలి. చికిత్స అనంతరమూ 30-60 నిమిషాల సేపు అలాగే ఉంచాలి. తొలిసారి రేడియేషన్ తీసుకుంటున్నప్పటి నుంచే వీటిని వాడుకోవాలి. కీమోతో జుట్టు రాలటమనేది తొలిసారి చికిత్స తర్వాతే మొదలవుతుంది.

ఎవరికి సరిపోతాయి?
చల్లటి టోపీలు అందరికీ సరిపడవు. కొన్ని కీమో మందులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇవి స్వల్పంగా చేరినా వెంట్రుకల కుదుళ్లు దెబ్బతింటాయి. రక్త, మెదడు క్యాన్సర్లు.. పార్శ్వనొప్పి, కాలేయ జబ్బు గలవారు.. ఎముకమజ్జ మార్పిడికి సిద్ధమయ్యేవారు, 18 ఏళ్లలోపు వారికి ఈ టోపీలు వద్దు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.