ఖమ్మం డిసెంబర్
పున్నమి ప్రతి నిధి
స్థానిక పంచాయతీ ఎన్నికల సందర్భంగా కిష్టాపురంలో కాంగ్రెస్ పంచాయతీ అభ్యర్థి, బీజేపీ కారణంగానే తాను ఓడిపోయానని ఆక్రోశంతో భారతీయ జనతా పార్టీ నాయకులు జోగారావు గారి పై దాడి చేయడం దుర్మార్గమని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో గాయపడిన జోగారావు గారిని బీజేపీ నాయకులు పరామర్శించారు.
ఈ సందర్భంగా పోలీసులు తగు విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసకు తావు లేదని, రాజకీయ భేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయుడు రాఘవరావు, వీరం రాజు, ఈవి రమేష్, శాలి శివ సుదర్శన్ మిశ్రతో పాటు భారతీయ జనతా పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.


