తాళ్లపూడి, (పున్నమి ప్రతినిధి ), మార్చి 6:
వేగేశ్వరపురం గ్రామానికి చెందిన డయాలసిస్ పేషెంట్ కంకిపాటి సుహాసినికి వైద్య చికిత్స మరియు మందుల ఖర్చుల కోసం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ – తాళ్లపూడి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. సంస్థ తరపున రూ.6,000లు మరియు జిల్లా ఉపాధ్యక్షులు వాసిబోయిన చంద్రయ్య వ్యక్తిగతంగా రూ.1,000లు అందజేయడంతో మొత్తం రూ.7,000ల సహాయం అందించామని సంస్థ అధ్యక్షులు వెలుగుబంటి శ్రీనివాస్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్నవారి కన్నీటిని తుడవడం మానవత సంస్థ ప్రధాన లక్ష్యమని అన్నారు. ముఖ్యంగా విద్య మరియు వైద్య సేవల కోసం సంస్థ ఎక్కువగా సహాయం అందిస్తున్నదని పేర్కొన్నారు.
జిల్లా ఉపాధ్యక్షులు వాసిబోయిన చంద్రయ్య మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారు మానవత సంస్థను ఆశ్రయిస్తే సాధ్యమైనంత సహాయం అందిస్తామని తెలిపారు. సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి ఆశయాల మేరకు మానవులకు సేవ చేయడం సంస్థ ముఖ్య ఉద్దేశమని చెప్పారు.

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మహిళకు మానవత సహాయం
తాళ్లపూడి, (పున్నమి ప్రతినిధి ), మార్చి 6: వేగేశ్వరపురం గ్రామానికి చెందిన డయాలసిస్ పేషెంట్ కంకిపాటి సుహాసినికి వైద్య చికిత్స మరియు మందుల ఖర్చుల కోసం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ – తాళ్లపూడి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. సంస్థ తరపున రూ.6,000లు మరియు జిల్లా ఉపాధ్యక్షులు వాసిబోయిన చంద్రయ్య వ్యక్తిగతంగా రూ.1,000లు అందజేయడంతో మొత్తం రూ.7,000ల సహాయం అందించామని సంస్థ అధ్యక్షులు వెలుగుబంటి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్నవారి కన్నీటిని తుడవడం మానవత సంస్థ ప్రధాన లక్ష్యమని అన్నారు. ముఖ్యంగా విద్య మరియు వైద్య సేవల కోసం సంస్థ ఎక్కువగా సహాయం అందిస్తున్నదని పేర్కొన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు వాసిబోయిన చంద్రయ్య మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారు మానవత సంస్థను ఆశ్రయిస్తే సాధ్యమైనంత సహాయం అందిస్తామని తెలిపారు. సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి ఆశయాల మేరకు మానవులకు సేవ చేయడం సంస్థ ముఖ్య ఉద్దేశమని చెప్పారు.

