Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Kadapa

కిచెన్ గార్డెన్లతో పోషకాహార భద్రత మహిళా సంఘాల ఆధ్వర్యంలో కిచెన్ గార్డెన్ కిట్స్ పంపిణీ

Punnami Newsroom Published: Updated:
కిచెన్ గార్డెన్లతో పోషకాహార భద్రత మహిళా సంఘాల ఆధ్వర్యంలో కిచెన్ గార్డెన్ కిట్స్ పంపిణీ

(పున్నమి ప్రతినిధి)
వేముల, అక్టోబర్ 7:
గ్రామీణ కుటుంబాల్లో పోషకాహార భద్రతను పెంపొందించడంతో పాటు ఇంటి వద్దే తాజా ఆకుకూరలు, కూరగాయలను సాగు చేసుకునేలా ప్రోత్సహించేందుకు వేముల మండలంలో కిచెన్ గార్డెన్ కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామీణ కుటుంబాలకు కిట్స్ అందజేశారు.

ఇంటి పరిసరాల్లో అందుబాటులో ఉన్న స్థలాన్ని వినియోగించుకుని వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలను సాగు చేసుకోవాలని సూచించారు. సహజ, సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడం ద్వారా కుటుంబ సభ్యులకు సురక్షితమైన, పోషకాహారంతో కూడిన ఆహారం అందించవచ్చని తెలిపారు.

ఈ సందర్భంగా వెలుగు–డీఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ (APM) ఆంజనేయులు మాట్లాడుతూ, ప్రతి కుటుంబం కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన, తాజా కూరగాయలను ఇంటి వద్దే పండించుకోవచ్చని తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు కిచెన్ గార్డెన్ల ఏర్పాటులో చురుకైన భాగస్వామ్యం వహించాలని సూచించారు.

కిచెన్ గార్డెన్ల ద్వారా కుటుంబాలకు అవసరమైన ఆకుకూరలు, కూరగాయలు అందుబాటులోకి రావడంతో పాటు మార్కెట్‌పై ఆధారపడటం కొంతవరకు తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు. అలాగే కుటుంబ ఆర్థిక పొదుపు, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ఇవి దోహదపడతాయని వివరించారు.

మహిళా సంఘాల సభ్యులు తమ గ్రామాల్లోని కుటుంబాలకు కిచెన్ గార్డెన్ల ప్రయోజనాలను వివరించి, వాటి ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించాలని తెలిపారు. ప్రతి గ్రామంలో కిచెన్ గార్డెన్ల సంఖ్యను పెంచేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ కో ఆర్డినేటర్లు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామ సమాఖ్య ప్రతినిధులు, సీసీలు, వీఓఏలు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

కిచెన్ గార్డెన్లతో పోషకాహార భద్రత మహిళా సంఘాల ఆధ్వర్యంలో కిచెన్ గార్డెన్ కిట్స్ పంపిణీ

కిచెన్ గార్డెన్లతో పోషకాహార భద్రత మహిళా సంఘాల ఆధ్వర్యంలో కిచెన్ గార్డెన్ కిట్స్ పంపిణీ

కిచెన్ గార్డెన్లతో పోషకాహార భద్రత మహిళా సంఘాల ఆధ్వర్యంలో కిచెన్ గార్డెన్ కిట్స్ పంపిణీ

కిచెన్ గార్డెన్లతో పోషకాహార భద్రత మహిళా సంఘాల ఆధ్వర్యంలో కిచెన్ గార్డెన్ కిట్స్ పంపిణీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *