*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-*
కింగ్ జార్జ్ ఆసుపత్రికి (కేజిహెచ్) డివిస్ ల్యాబొరేటరీస్ వారు సామాజిక బాధ్యత కార్యక్రమం (CSR) లో భాగంగా రూ.2.50 లక్షల విలువైన 3 సీటర్ల 25 రో చైర్లు విరాళంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో కేజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి, సిఎస్‌ఆర్‌ఎమ్‌ఓ డాక్టర్ ఉ. శ్రీహరి, రేడియేషన్ ఆంకాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
డాక్టర్ ఐ. వాణి గారు డివిస్ ల్యాబొరేటరీస్ వారి ఉదార సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ చైర్లు ఆసుపత్రి రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు


