అమరావతి
*కాశీబుగ్గ ఆలయం పూర్తి గా ప్రైవేట్ వ్యక్తులు అధీనం లో ఉన్న దేవాలయం*: మంత్రి ఆనం
శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దురదృష్టకర ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
➖ *ఈ ఆలయం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్నదని, దేవాదాయ శాఖకు లేదా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు.*
➖ సుమారు 2000 మందిని మాత్రమే పట్టే ఈ దేవస్థానానికి ఒక్కసారిగా 25 వేల మంది భక్తులు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు.
➖ *ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.*
➖ ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్న ఆలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
➖ ఇంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ప్రైవేట్ వ్యక్తులు ఎటువంటి సమాచారం ప్రభుత్వానికి లేదా దేవాదాయ శాఖకు అందించలేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.


