*కాశిబుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. తొమ్మిదిమంది మృతి*
శ్రీకాకుళం( విశాఖపట్నం) పున్నమి ప్రతినిధి:-
శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది.
కాశిబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది.
ఈ ఘటనలో తొమ్మిది మంది భక్తులు మృతి చెందగా..
పలువురు గాయపడినట్లు సమాచారం.
కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఏకాదశి కావడంతో వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. రెయిలింగ్ ఊడటంతో భక్తులు కింద పడ్డారు.
5 ఏళ్ల క్రితం…12 ఎకరాల్లో 10 కోట్ల వ్యయం తో పండా ఎస్టేట్ లో హరిముకుంద్ పండా నిర్మించిన ఆలయం…..ఇప్పటికీ 90 ఏళ్ల వయసులో ఆలయ నిర్మాణ బాధ్యతలు ఆయనే దగ్గరుండి చూసుకుంటారు….ఓపెన్ గా పెద్ద గేట్ ఉంటుంది…ఆపే సెక్యూరిటీ ఎవరూ ఉండరు….నేరుగా వెళ్లి పోవడమే….క్యూ లైన్ సిస్టమ్ కూడా పెద్ద బలంగా ఉండదు…..ఆలయం లోపల మాత్రం విశాలంగా ఉంటుంది…


