కావలి సబ్ డివిజన్‌కు సోమవారం నూతన డీఎస్పీగా వి.వి. రమణ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కావలి పరిధిలో శాంతి భద్రతలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో నేరాలను అరికట్టి, భయరహిత వాతావరణం సృష్టించడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. పోలీస్ శాఖపై ప్రజల విశ్వాసం మరింత పెరగేలా పనిచేస్తానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, గతంలో కావలిలో పనిచేసిన శ్రీధర్ ఒంగోలు దిశ మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ఒంగోలులో విధులు నిర్వహించిన రమణ కుమార్ ఇప్పుడు కావలికి బదిలీ కావడంతో స్థానిక పోలీసు సిబ్బంది ఆయనకు అభినందనలు తెలియజేశారు.

కావలి సబ్ డివిజన్‌కు నూతన డీఎస్పీగా వి.వి. రమణ కుమార్ బాధ్యతలు స్వీకారం