Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

కావలిలో విలేఖరి సుబ్బారావు పై దాడి దురదృష్టకరం!

Punnami Newsroom Published:
కావలిలో విలేఖరి సుబ్బారావు పై దాడి దురదృష్టకరం!

Story highlights

  • విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులను సహించరాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి కావలి: సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా పనిచేస్తున్న పత్రికా విలేకరిపై దాడి…
  • బుధవారం పట్టణంలోని వైకుంఠపురంలో ఈనాడు విలేకరి సుబ్బారావు నివాసానికి వెళ్లిన కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
  • ఈ సందర్భంగా సుబ్బారావుకు ధైర్యం చెప్పి సంఘీభావం తెలిపారు.

విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులను సహించరాదు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి

పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

కావలి: సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా పనిచేస్తున్న పత్రికా విలేకరిపై దాడి జరగడం సమాజంపై జరిగిన దాడిగానే భావించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.

బుధవారం పట్టణంలోని వైకుంఠపురంలో ఈనాడు విలేకరి సుబ్బారావు నివాసానికి వెళ్లిన కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుబ్బారావుకు ధైర్యం చెప్పి సంఘీభావం తెలిపారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో సీనియర్ విలేకరి నాగేశ్వరరావుపై కూడా ఇలాగే దాడి జరిగిందని గుర్తుచేశారు. ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

సమాజంలో జరిగే మంచి, చెడులను ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే పత్రికా విలేకరుల ప్రధాన విధి అని, వార్తలను బట్టి ఏది మంచో, ఏది చెడో ప్రజలే నిర్ణయించుకుంటారని స్పష్టం చేశారు. పత్రికల్లో ప్రచురితమైన వార్తలు తమకు అనుకూలంగా లేవనో, వ్యక్తిగత కక్షలతోనో విలేకరులపై భౌతిక దాడులకు దిగడం సరైన పద్ధతి కాదన్నారు.

ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన పత్రికా రంగంపై దాడులు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. జర్నలిస్టులు నిర్భయంగా తమ విధులు నిర్వహించేందుకు తగిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి

విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన వారిపై భారతీయ న్యాయ సంహిత (BNS)–2023లోని నేర స్వభావానికి సంబంధించిన సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయాలని కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి కోరారు. దాడి, గాయపరచడం, బెదిరింపులు వంటి నేరాలకు సంబంధించి వర్తించే చట్టపరమైన నిబంధనలను నిందితులపై ప్రయోగించి, సమగ్ర విచారణ జరిపి బాధిత జర్నలిస్టుకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను కోరారు. దాడికి పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్టు సుబ్బారావు స్వల్ప గాయాలతో బయటపడటం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని, విలేకరుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. విలేకరిపై జరిగిన దాడి విషయాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

News Sources

  • Punnami ReportingOwn reporting

Leave a comment

Your email address will not be published. Required fields are marked *