Saturday, 14 March 2026
  • Home  
  • కావలిలో కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి ఘనంగా నిర్వహణ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కావలిలో కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి ఘనంగా నిర్వహణ

కావలి పట్టణం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని పెద్దపవని రోడ్ వైకుంఠపురం సెంటర్‌లో కావలి నియోజకవర్గ ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన ఆధ్వర్యంలో కుమ్మర ఆడపడుచు, తొలి తెలుగు మహిళా కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుమ్మర యువసేన నియోజకవర్గ అధ్యక్షుడు బెజవాడ అభిసాగర్ ప్రజాపతి మాట్లాడుతూ, ఆతుకూరి మొల్లమాంబ గారు సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన గొప్ప కవయిత్రి అని కొనియాడారు. రాబోయే రోజుల్లో కావలి పట్టణంలో మొల్లమాంబ గారి విగ్రహాన్ని అందరి సహకారంతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కుమ్మర యువసేన నాయకుడు మన్నేపల్లి రుషికేశ్ ప్రజాపతి మాట్లాడుతూ, కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించడం ఆనందకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు గుడ్లూరి మాల్యాద్రి ప్రజాపతి, యేగూరి చిన్నపుల్లయ్య ప్రజాపతి, కుమ్మర సంఘం నాయకులు బెజవాడ రవీంద్ర ప్రజాపతి, పొన్నగంటి మురళి ప్రజాపతి, బెజవాడ ప్రసన్న కుమార్ ప్రజాపతి, వేణు ప్రజాపతి, పత్తిపాటి వేదనాథ్ ప్రజాపతి, దిలీప్ కుమార్ ప్రజాపతి, బీసీ నాయకులు ద్రోణాదుల వెంకట్రావు, అద్దంకి ప్రభాకర్, న్యాయవాదులు ఎన్.భరత్ రాయల్, గుంజి నరేష్, బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు మామిడి వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు గుండ్లపల్లి భరత్ కుమార్, బ్రహ్మానందం, కుమార్ గౌడ్, మంద కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

కావలి పట్టణం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
కావలి పట్టణంలోని పెద్దపవని రోడ్ వైకుంఠపురం సెంటర్‌లో కావలి నియోజకవర్గ ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన ఆధ్వర్యంలో కుమ్మర ఆడపడుచు, తొలి తెలుగు మహిళా కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కుమ్మర యువసేన నియోజకవర్గ అధ్యక్షుడు బెజవాడ అభిసాగర్ ప్రజాపతి మాట్లాడుతూ, ఆతుకూరి మొల్లమాంబ గారు సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన గొప్ప కవయిత్రి అని కొనియాడారు. రాబోయే రోజుల్లో కావలి పట్టణంలో మొల్లమాంబ గారి విగ్రహాన్ని అందరి సహకారంతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
కుమ్మర యువసేన నాయకుడు మన్నేపల్లి రుషికేశ్ ప్రజాపతి మాట్లాడుతూ, కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించడం ఆనందకరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు గుడ్లూరి మాల్యాద్రి ప్రజాపతి, యేగూరి చిన్నపుల్లయ్య ప్రజాపతి, కుమ్మర సంఘం నాయకులు బెజవాడ రవీంద్ర ప్రజాపతి, పొన్నగంటి మురళి ప్రజాపతి, బెజవాడ ప్రసన్న కుమార్ ప్రజాపతి, వేణు ప్రజాపతి, పత్తిపాటి వేదనాథ్ ప్రజాపతి, దిలీప్ కుమార్ ప్రజాపతి, బీసీ నాయకులు ద్రోణాదుల వెంకట్రావు, అద్దంకి ప్రభాకర్, న్యాయవాదులు ఎన్.భరత్ రాయల్, గుంజి నరేష్, బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు మామిడి వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు గుండ్లపల్లి భరత్ కుమార్, బ్రహ్మానందం, కుమార్ గౌడ్, మంద కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.