Saturday, 28 March 2026
  • Home  
  • కాలుష్య రహిత విశాఖ అభివృద్ధికి సహకరిద్దాం జీ వీ ఎం సి అదనపు కమీషనర్
- విశాఖపట్నం

కాలుష్య రహిత విశాఖ అభివృద్ధికి సహకరిద్దాం జీ వీ ఎం సి అదనపు కమీషనర్

కాలుష్య రహిత విశాఖ అభివృద్ధికి సహకరిద్దాం. *నగరంలో స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణంకు మొక్కలను నాటి చెట్లను పెంచుదాం . – జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి. – విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి : విశాఖను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు, నగరంలో స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణం అభివృద్ధికి మొక్కలను నాటి చెట్లను పెంచేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి మూడవ శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు “క్లీన్ ఎయిర్” కార్యక్రమాన్ని భీమిలి బీచ్ పార్కులో స్వచ్ఛ ఆంధ్ర డైరెక్టర్ నాగలక్ష్మి , ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ ఎన్ వి నరేష్ కుమార్ , భీమిలి జోనర్ కమిషనర్ అయ్యప్ప నాయుడు లతో కలిసి అదనపు కమిషనర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా జీవీఎంసీ అదనపు కమిషనర్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ క్లీన్ హెయిర్ కార్యక్రమం పై రూపొందించిన స్వచ్ఛ ప్రతిజ్ఞను అందరితో చేయించి,సమీప పార్కులో మొక్కలను నాటి, స్వచ్ఛ దీపావళి – శుభ దీపావళి జరుపుకోవాలనే నినాదంతో పోస్టర్ ను ప్రారంభించి, ప్లాస్టిక్ ను విడనాడాలని అవగాహనకు వస్త్ర సంచులను అందరికీ ఉచితంగా పంచారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యమైన వాతావరణంలో ప్రజలు నివసించేందుకు ,కాలుష్య రహిత విశాఖనగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. విశాఖ నగరంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా నగర ప్రజలు సౌర విద్యుత్ ను వినియోగించుకోవాలని, రోజురోజుకు పెరిగిపోతున్న జల, వాయు, శబ్ద కాలుష్యాల నుండి విశాఖ నగరాన్ని కాపాడుకునేందుకు ఇంధన వినియోగాన్ని పొదుపు చేస్తూ విద్యుత్ వాహనాలు, సైకిళ్లు, ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించడంతోపాటు మొక్కలను నాటి చెట్లను పెంచడం ద్వారా కాలుష్య నివారణ కు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని తద్వారా స్వచ్ఛమైన గాలిని కాపాడుకొని అందరూ ఆరోగ్యం గా జీవించాలన్నారు. సోమవారం జరుపుకోనున్న దీపావళి పర్వదినాన్ని కాలుష్య రహితంగా , పర్యావరణహితంగా, హరిత దీపావళి ,స్వచ్ఛ దీపావళి- శుభ దీపావళి గా జరుపుకోవాలని అదనపు కమిషనర్ తెలిపారు . అనంతరం స్వచ్ఛ ఆంధ్ర డైరెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ విశాఖ నగరం ఎంతో ఆకర్షణీయమైన నగరమని, ఈ విశాఖ నగరాన్ని కి ఎంతోమంది పర్యాటకులు సందర్శకులు వస్తారని వారికి ఆకర్షణీయమైన, ఆహ్లాదకరమైన స్వచ్చ మైన గాలితో కూడిన వాతావరణాన్ని అందించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమం ద్వారా వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ఎంతో కృషి చేస్తున్నారని అందుకు ప్రజలు చెట్లు నాటడంతో పాటు విద్యుత్తు వాహనాలు, సైకిల్, ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించి విశాఖ నగరాన్ని క్లీన్ ఎయిర్ విశాఖగా, గ్రీన్ విశాఖగా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం అందరూ కలిసి అక్కడ ఏర్పాటు చేసిన పర్యావరణ అవగాహనపై ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించిన అనంతరం గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీవో నేతృత్వంలో తెల్ల వంగ, నల్ల వంగ, పచ్చిమిర్చి ,టమాటా , బంతి నారు మొక్కలు ప్రజలకు,ప్రభుత్వ వసతి గృహాలకు పంపిణీ చేశారు. అనంతరం భీమిలి నరసింహ స్వామి దేవాలయం కొండపై పచ్చదనాన్ని పెంపొందించేందుకు గో ఆధారిత రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రమణ్య వర్మ 300 కిలోల అడవి జాతి విత్తనాలు , సెయింట్ జోసఫ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ జ్ఞానాపురం వారు 30 వేల సీడ్ బాల్స్ , మిషన్ గ్రీన్ భీమిలి 25 వేల సీడ్ బాల్స్ ఉచితంగా అందజేయగా వాటిని గ్రీన్ క్లైమేట్ టీం, మిషన్ గ్రీన్ భీమిలిల నేతృత్వంలో భీమిలి కొండల మీద డ్రోన్ల సహాయంతో అడవి జాతి , దేశీయ కూరగాయ మొక్కల విత్తనాలు వెదజల్లే కార్యక్రమం అదనపు కమిషనర్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ ఎన్ వి నరేష్ కుమార్, భీమిలి జోనల్ కమిషనర్ అప్పయ్య నాయుడు, 3వ వార్డ్ టిడిపి నాయకులు గంటా నూకరాజు , జీవీఎంసీ ఎస్ ఆర్ యు బృందం, గ్రీన్ క్లైమేట్ బృందం , గో ఆధారిత రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రమణ్య వర్మ ,సెయింట్ జోసఫ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ జ్ఞానాపురం ప్రతినిధులు , మిషన్ గ్రీన్ భీమిలి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

కాలుష్య రహిత విశాఖ అభివృద్ధికి సహకరిద్దాం.

*నగరంలో స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణంకు మొక్కలను నాటి చెట్లను పెంచుదాం .

– జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి.

విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి : విశాఖను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు, నగరంలో స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణం అభివృద్ధికి మొక్కలను నాటి చెట్లను పెంచేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి మూడవ శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు “క్లీన్ ఎయిర్” కార్యక్రమాన్ని భీమిలి బీచ్ పార్కులో స్వచ్ఛ ఆంధ్ర డైరెక్టర్ నాగలక్ష్మి , ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ ఎన్ వి నరేష్ కుమార్ , భీమిలి జోనర్ కమిషనర్ అయ్యప్ప నాయుడు లతో కలిసి అదనపు కమిషనర్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముందుగా జీవీఎంసీ అదనపు కమిషనర్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ క్లీన్ హెయిర్ కార్యక్రమం పై రూపొందించిన స్వచ్ఛ ప్రతిజ్ఞను అందరితో చేయించి,సమీప పార్కులో మొక్కలను నాటి, స్వచ్ఛ దీపావళి – శుభ దీపావళి జరుపుకోవాలనే నినాదంతో పోస్టర్ ను ప్రారంభించి, ప్లాస్టిక్ ను విడనాడాలని అవగాహనకు వస్త్ర సంచులను అందరికీ ఉచితంగా పంచారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యమైన వాతావరణంలో ప్రజలు నివసించేందుకు ,కాలుష్య రహిత విశాఖనగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. విశాఖ నగరంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా నగర ప్రజలు సౌర విద్యుత్ ను వినియోగించుకోవాలని, రోజురోజుకు పెరిగిపోతున్న జల, వాయు, శబ్ద కాలుష్యాల నుండి విశాఖ నగరాన్ని కాపాడుకునేందుకు ఇంధన వినియోగాన్ని పొదుపు చేస్తూ విద్యుత్ వాహనాలు, సైకిళ్లు, ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించడంతోపాటు మొక్కలను నాటి చెట్లను పెంచడం ద్వారా కాలుష్య నివారణ కు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని తద్వారా స్వచ్ఛమైన గాలిని కాపాడుకొని అందరూ ఆరోగ్యం గా జీవించాలన్నారు. సోమవారం జరుపుకోనున్న దీపావళి పర్వదినాన్ని కాలుష్య రహితంగా , పర్యావరణహితంగా, హరిత దీపావళి ,స్వచ్ఛ దీపావళి- శుభ దీపావళి గా జరుపుకోవాలని అదనపు కమిషనర్ తెలిపారు .

అనంతరం స్వచ్ఛ ఆంధ్ర డైరెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ విశాఖ నగరం ఎంతో ఆకర్షణీయమైన నగరమని, ఈ విశాఖ నగరాన్ని కి ఎంతోమంది పర్యాటకులు సందర్శకులు వస్తారని వారికి ఆకర్షణీయమైన, ఆహ్లాదకరమైన స్వచ్చ మైన గాలితో కూడిన వాతావరణాన్ని అందించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమం ద్వారా వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ఎంతో కృషి చేస్తున్నారని అందుకు ప్రజలు చెట్లు నాటడంతో పాటు విద్యుత్తు వాహనాలు, సైకిల్, ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించి విశాఖ నగరాన్ని క్లీన్ ఎయిర్ విశాఖగా, గ్రీన్ విశాఖగా తీర్చిదిద్దాలన్నారు.

అనంతరం అందరూ కలిసి అక్కడ ఏర్పాటు చేసిన పర్యావరణ అవగాహనపై ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించిన అనంతరం గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీవో నేతృత్వంలో తెల్ల వంగ, నల్ల వంగ, పచ్చిమిర్చి ,టమాటా , బంతి నారు మొక్కలు ప్రజలకు,ప్రభుత్వ వసతి గృహాలకు పంపిణీ చేశారు.

అనంతరం భీమిలి నరసింహ స్వామి దేవాలయం కొండపై పచ్చదనాన్ని పెంపొందించేందుకు గో ఆధారిత రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రమణ్య వర్మ 300 కిలోల అడవి జాతి విత్తనాలు , సెయింట్ జోసఫ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ జ్ఞానాపురం వారు 30 వేల సీడ్ బాల్స్ , మిషన్ గ్రీన్ భీమిలి 25 వేల సీడ్ బాల్స్ ఉచితంగా అందజేయగా వాటిని గ్రీన్ క్లైమేట్ టీం, మిషన్ గ్రీన్ భీమిలిల నేతృత్వంలో భీమిలి కొండల మీద డ్రోన్ల సహాయంతో అడవి జాతి , దేశీయ కూరగాయ మొక్కల విత్తనాలు వెదజల్లే కార్యక్రమం అదనపు కమిషనర్ చేపట్టారు.

ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ ఎన్ వి నరేష్ కుమార్, భీమిలి జోనల్ కమిషనర్ అప్పయ్య నాయుడు, 3వ వార్డ్ టిడిపి నాయకులు గంటా నూకరాజు , జీవీఎంసీ ఎస్ ఆర్ యు బృందం, గ్రీన్ క్లైమేట్ బృందం , గో ఆధారిత రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రమణ్య వర్మ ,సెయింట్ జోసఫ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ జ్ఞానాపురం ప్రతినిధులు , మిషన్ గ్రీన్ భీమిలి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.