కాలభైరవ సన్నిధిలో హైకోర్టు జడ్జి ప్రత్యేక పూజలు
కామారెడ్డి, 27 సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి :
ఇసన్నపల్లి కాలభైరవ స్వామి సన్నిధిలో హైకోర్టు, జిల్లా జడ్జిల ప్రత్యేక పూజలు నిర్వహించారని ఆలయ ఈఓ ప్రభు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం ఇసన్నపల్లి – రామారెడ్డి గ్రామంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానాన్ని శనివారం హైకోర్టు జడ్జి శ్రీ నర్సింగ్ రావు, జిల్లా జడ్జిలు దర్శించుకున్నారు.ఆలయంలో స్వామి వారికి అభిషేకము నిర్వహించి, ప్రత్యేక మొక్కు బడులు చెల్లించుకున్నారు. వారి వెంట జిల్లా జడ్జి వరప్రసాద్ స్వామివారి దర్శనంలో పాల్గొన్నారు.
దర్శనా అనంతరం ఆలయం తరపున హైకోర్టు జడ్జి శ్రీ నర్సింగ్ రావు, జిల్లా జడ్జి లకు ఆలయ అధికారులు ఘనంగా సన్మానించి మెమోంటోలను అంధజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రభు, పూజారి శ్రీనివాస్ శర్మ, క్లర్క్ సిహెచ్ లక్ష్మణ్, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


