పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 04 : ఓ రాజు రాజ్యమేలాలంటే… ఓ మంచి సలహాలు ఇచ్చే మంత్రి ఉండాలి. అలాగే ఓ నాయకుడు ప్రజాప్రతినిధి కావాలంటే కార్యకర్తల్లా పని చేసి సైన్యం ఉండాలని మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం సోమాజీగూడ కాలనీల్లో రాత్రి విస్తృత ప్రచారం చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కె ఎల్ ఆర్ మాట్లాడుతూ… నాయకులు సైతం కార్యకర్తల్లా పని చేసి నవీన్ యాదవ్ విజయం కోసం కృషి చేయాలని చెప్పారు. ప్రతీ డివిజన్, బూత్ స్థాయిలో మహేశ్వరం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులకు బాధ్యతలు అప్పగించారు. ఇంటింటి ప్రచారం, కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి అందించే రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఉచిత కరెంట్, ఆర్టీసీ బస్సు ప్రయాణం సహా పలు పథకాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 80శాతం ప్రజలు తీసుకుంటున్నారని కేఎల్ఆర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు సహా మహేశ్వరం నియోకవర్గం కాంగ్రెస్ సేనా పాల్గొంది.

కార్యకర్తల్లా… నాయకులు పని చేయాలి: కె ఎల్ ఆర్ –జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి* —మహేశ్వరం నియోజకవర్గం ముఖ్య నాయకులకు బూత్ ల బాధ్యత* —ప్రచారంలో పాల్గొనే నేతలు 9గంటలకు చేరుకోవాలి*
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 04 : ఓ రాజు రాజ్యమేలాలంటే… ఓ మంచి సలహాలు ఇచ్చే మంత్రి ఉండాలి. అలాగే ఓ నాయకుడు ప్రజాప్రతినిధి కావాలంటే కార్యకర్తల్లా పని చేసి సైన్యం ఉండాలని మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం సోమాజీగూడ కాలనీల్లో రాత్రి విస్తృత ప్రచారం చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కె ఎల్ ఆర్ మాట్లాడుతూ… నాయకులు సైతం కార్యకర్తల్లా పని చేసి నవీన్ యాదవ్ విజయం కోసం కృషి చేయాలని చెప్పారు. ప్రతీ డివిజన్, బూత్ స్థాయిలో మహేశ్వరం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులకు బాధ్యతలు అప్పగించారు. ఇంటింటి ప్రచారం, కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి అందించే రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఉచిత కరెంట్, ఆర్టీసీ బస్సు ప్రయాణం సహా పలు పథకాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 80శాతం ప్రజలు తీసుకుంటున్నారని కేఎల్ఆర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు సహా మహేశ్వరం నియోకవర్గం కాంగ్రెస్ సేనా పాల్గొంది.

