కార్యకర్తలకు అండగా… యువ నాయకులు ముక్కా సాయి వికాస్ రెడ్డి
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 8 (మనం న్యూస్ ప్రతినిధి ): రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు ఏకష్టం వచ్చినా తాము అండగా నిలబడతామని టిడిపి యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి తెలిపారు. ఓబులవారిపల్లి మండలం గద్దలరేవులపల్లి గ్రామ వాస్తవ్యులు సంఘ రాజు చంద్ర రాజు కొద్దిరోజుల క్రితం మరణించగా, శనివారం నాడు చంద్ర రాజు సతీమణి, సరస్వతి కి ఆర్థిక సహాయం అందించారు, అనంతరం అదే గ్రామానికి చెందిన రేవూరి కృష్ణయ్య వారి భార్యకు ఆర్థిక సహాయం అందజేశారు అనంతరం వారి కుటుంబాలకు పార్టీ తరఫున వ్యక్తిగతంగా అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లొ కూటమి నాయకులు పాల్కొన్నారు


