విజయవాడ: కార్మికుల, రైతుల, వ్యవసాయకూలీలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్రోహం చేస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు సంయుక్తంగా రాష్ట్ర స్థాయి నాయకత్వ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్శింగ్ రావు మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ఫ్లాంట్ కార్మికులనుద్ధేశించి సిఎం చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. ఫ్లాంట్ ని వైట్ ఎలిఫెంట్ అని, కార్మికులు పనిచేయని దొంగలని, వారిపై పిడి యాక్ట్ లు పెడతానని హెచ్చరించటం సిఎం కి సహేతుకం కాదని తప్పు పట్టారు. కార్మిక ద్రోహులు, అధికారమదంతో ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ప్రైవేటీకరణకు వ్యతిరేకమని, అధికారం అధిష్టానం పీఠం ఎక్కినాకా బోడి మల్లయ్య చందంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రాంపల్లి రవీంద్ర నాథ్ మాట్లాడుతూ ఉద్యోగ, కార్మికులకు పనిగంటలను పెంపుదల చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పోరాడిసాధింంచిన కార్మిక హక్కులను, చట్టాలను తుంగలో తొక్కుతున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ కార్పొరేట్ అనుకూల, రైతు, కార్మిక, కూలీల వ్యతిరేక విధానాలు అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని విమర్శించారు. పారిశ్రామిక రంగంలో కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కొడ్స్, వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 26న జరిగే జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శన లు, జిల్లా కలెక్టర్ లకు డిమాండ్ లతో కూడిన వినతిపత్రాలు అందజేయాలని పిలుపు నిచ్చారు. మాజీ మంత్రి, ఏపి రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ బడా కార్పొరేట్ కంపెనీలకు రాష్ట్ర వనరులను పప్పుబెల్లం వలె పంచుతున్నారని, సిఎం చంద్రబాబు పై మండిపడ్డారు. చంద్రబాబు అధికారం కైవసం చేసుకున్న తొలిరోజుల నుండి అన్ని రంగాలను ప్రైవేటీకరణకే పెద్దపీఠ వేసి, ప్రభుత్వ రంగాన్ని నాశనం చేశారని విమర్శించారు. వ్యవసాయం దండగా అంటూ దుంపనాశనం చేశారని ఏద్ధేవా చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ తానా అంటే తందానా అంటూ డు..డు.. బసవన్నలాగా తయారయ్యడని దుయ్యబట్టారు. ప్రజా పోరాటాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచాలని కార్మికులకు, రైతులకు, వ్యవసాయ కూలీలకు పిలుపునిచ్చారు. రైతు సంఘం నాయకులు వై. కేశవరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన మార్కేట్ విధానం, నూతన విత్తన చట్టం, విద్యుత్ సంస్కరణల పేరుతో రైతులను, కూలీలను, కార్మికులకు ద్రోహం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశానికి సి ఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ, ఏఐకెఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు యం. వెంకటరెడ్డి, ఐఎఫ్ టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం. రామకృష్ణ, సిఐటియు రాష్ట్ర నాయకులు వెంకటసుబ్బమ్మ, ఏఐయుటియుసి రాష్ట్ర అధ్యక్షులు సుధీర్, యుటియుసి రాష్ట్ర అధ్యక్షులు జూపల్లి జానకీరాములు, టియుసిఐ రాష్ట్ర అధ్యక్షులు మరీదు ప్రసాద్ బాబు, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చలసాని రామారావు, ఉపాధ్యక్షులు కృష్ణ మూర్తి, నగర అధ్యక్షులు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి మూలి సాంబశివరావు, ఏఐసిటియు రాష్ట్ర నాయకులు లక్ష్మి నారాయణ, ఏఐకెఎఫ్ రాష్ట్ర నాయకులు కాసాని గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

కార్మిక, రైతు, కూలీల ద్రోహి సిఎం సిఎం చంద్రబాబు పై కార్మిక సంఘాల మండిపాటు. 26న జిల్లా కేంద్రాల్లో నిరసన, ప్రదర్శనలకు పిలుపు