కార్పొరేషన్ లోని పార్కులను ఆధునీకరించాలి – ముక్కు రాధాకృష్ణ గౌడ్
నెల్లూరు మార్చి ( పున్నమి ప్రతినిధి)
నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్, సూపరింటెండెంట్ ఇంజనీర్లను కార్పోరేషన్ లోని పార్కుల సమస్యలపై జనతా వాకర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ముక్కు రాధాకృష్ణ గౌడ్ కలిసి వినతిపత్రం సమర్పించారు. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో 64 పార్కులు ఉన్నాయని సహజంగా పార్కుల్లో వాకింగ్ ట్రాక్లు, యోగా సెంటర్లు, మినీ జిమ్ములు, స్విమ్మింగ్ పూల్స్, షటిల్ కోర్టులు, కబడ్డీ కోర్టులు వివిధ ఆటలకు సంబంధించిన గేమ్స్ కు సంబంధించిన కోర్టులు చిన్నపిల్లలకు ఆట వస్తువులు వివిధ బొమ్మలు వృద్ధులకు సిమెంట్ బల్లలు, స్కేటింగ్ కోర్టు లు, కరాటే కోర్టులు, మంచినీరు పచ్చని మొక్కలు విద్యుత్ సౌకర్యం టాయిలెట్స్ డ్రైనేజీ సిస్టం మొదలగునవి తప్పకుండా ఉండాల్సి ఉండగా లేవని పేర్కొన్నారు.కానీ కొన్ని పార్కులలో ఇవన్నీ నిరుపయోగంగా ఉన్నాయని పరికరాలను జిమ్ములను తక్షణమే అభివృద్ధి పరచాలని వాకింగ్ ట్రాక్లను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందుబాటులో ఉంచాలని అదేవిధంగా కొత్త కొత్త జాతుల మొక్కలను పెంచాలని ప్రైవేట్ వ్యక్తుల నుండి వారి ఆక్రమణల నుండి పార్కులను కాపాడాలని కోరారు.అధికారులు నిత్యం అన్ని పార్కులను విధిగా విజిట్ చేయాలని పార్కుల్లో ఆహ్లాదాన్ని అందాన్ని ఆక్సిజన్ ని ఇచ్చే మొక్కలను ఎక్కువ సంఖ్యలో పెంచాలని కార్పొరేషన్ పరిధిలోని అన్ని పార్కులలో వ్యాపార సంస్థలు లాభాపేక్షతో చేసే కార్యక్రమాలకు విధిగా రుసుమును వసూలు చేయాలని అలాగే కార్పొరేషన్ పరిధిలోని అన్ని పార్కులలో వ్యామకారులకు, క్రీడాకారులకు, వాకర్స్కు వారి అసోసియేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేసుకునేందుకు పార్కులో ఉచిత వసతిని ఏర్పాటు చేయాలని ఉచిత శిక్షణా తరగతులు ఉచిత పౌచ్ పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాలు, ఆరోగ్యానికి సంబంధించిన వ సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమాలు జరుపుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.
ఎక్కడికక్కడ స్థానిక పార్కులలో ఉచిత అనుమతులు ఇవ్వాలని జనతా వాకర్స్ అసోసియేషన్ జిల్లా శాఖ తరపున కోరారు.
పై కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు కాయల.మధు పులిచెర్ల. ఉదయ్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు తిరకాల.శివ గౌడ్ జిల్లా కార్యదర్శులు తణుకు.ముని బాబు పైడి.చరణ్ తేజ మరియు తదితరులు పాల్గొన్నారు.*

