*కార్తీక పౌర్ణమి వైశిష్ట్యం*
..
కార్తీక పౌర్ణమి, కార్తీకమాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి తిధి. ఇది చాలా విశిష్టత కలిగిన రోజు. శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం. హరిహరులకు ఎంతో ప్రీతికరమైన మాసం కనుక ఇద్దరినీ సేవిస్తే, ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.అని పురాణాలు చెబుతున్నాయి.
ప్రతి మాసము మనకు ప్రత్యేకమైనది. ఏ మాసపు ప్రత్యేకత ఆ మాసానిది. కార్తీక మాసంలో ప్రతిరోజూ ప్రధానమైనదే. ఏకాదశులు,శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి శక్తివంతమైనవి. నెల రోజుల్లో చేసే పూజల ఫలితం ఒక ఎత్తు.పౌర్ణమి రోజున చేసే పూజ కార్య కలాపాలు ఒక ఎత్తు. **అభిషేక ప్రియో శివః** అభిషేక ప్రియుడు శివుడు గనుక శివాలయములలో రుద్రాభిషేకం చేయించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఏకాదశ రుద్రాభిషేకాలు చేయించిన కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రగాఢ విశ్వాసం.’ ఈ మాసంలో రుద్రాభిషేకాలు,కేదారేశ్వర వ్రతం, కార్తీక దామోదర పూజ,తులసి పూజ, తులసి,ఉసిరి కలిపి పూజ ,క్షీరాబ్ది ద్వాదశి పూజ,దీప దానాలు,పసుపు లింగార్చన.. స్త్రీ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పాలు,తాంబూలం తో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానం చేయటం ముఖ్యమైన కార్యములు.ఇవి ఆచరించినట్లయితే సర్వ శుభాలు చేకూరుతాయి అని పెద్దల శ్రీ సూక్తి. నదీ స్నానములకు ఈ మాసంలో ప్రాముఖ్యత. నదులు సమీపంలో లేనట్లయితే బావుల దగ్గర గాని, చెరువుల వద్ద గాని స్నానమాచరించవలెను.
*_గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు* అను శ్లోకంతో స్నానం చేయవలెను.కార్తీక పౌర్ణమి దీపారాధనకు అత్యంత ప్రాముఖ్యం కలిగిన రోజు. శైవాలయాలలో వైష్ణ వాలయాలలో దీపారాధనలు చేస్తారు. శివాలయాలలో ధ్వజస్తంభం మీద *నందా దీపం* పేరుతో అఖండ దీపాన్ని వెలిగిస్తారు. వైష్ణవాలయాలలో ధ్వజస్తంభం ఎదుట, తులసికోట వద్ద,గోపురం మీద,పెరుమాళ్ళ సన్నిధిలో పిండితో చేసిన దీపాలు, ఉసిరికాయల మీద ఇలా పలు రకాలుగా దీపాలను వెలిగిస్తారు. దీపారాధన అనంతరం ఆయా స్థలాల్లో దీపాలను ఉంచటం…… పసుపు,కుంకుమ,అక్షతలు, పుష్పాలు ‘ సమర్పించి అప్పుడు దీపాలను ఆయా స్థలాల్లో ఉంచాలి . ఈరోజు ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర వ్రతం ఒకటి. భక్తులు వాళ్ల కోరికలను నెరవేర్చి సౌభాగ్యాన్ని కలిగించే వ్రతం ఇది. ఈ దీపారాధనలకు ఆవు నెయ్యిని ఉపయోగించడం వలన వాతావరణ కాలుష్యాన్ని కొంతవరకు అరికట్టవచ్చు. ప్రదోషంలో కాలకృత్యాలను తీర్చుకుని శివాలయంలో కానీ విష్ణు ఆలయాల్లో గాని రావి చెట్టువద్ద గాని, అరటి దొప్పలలో గాని, ఆకుదుప్పలలో గాని దీపాలను వెలిగించాలి. నదులలో దీపదానం చేయాలి.అది అవకాశం లేని వాళ్ళు ఇంట్లో ఒక బకెట్లో కానీ…. ఒక టబ్బులో గానీ నీళ్లను తీసుకొని వాటిలో దీపదానం చేయవచ్చు. త్రిపురాసురులను సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. రాక్షస సంహారం జరిగినందున ఆనందంతో శివతాండవం జరిగింది. ఈరోజున దీపాలను వెలిగిస్తే సకల పాపాలు తొలగిపోతాయి.కార్తీక సోమ వారాల్లో మహాభిషేకాలు, రుద్రాభిషేకాలు,శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరపడం పరిపాటి.కార్తీక పౌర్ణమి నాడు సముద్ర స్నానం శుభప్రదం. కార్తీక పౌర్ణమి నాడు అన్నదానం,వస్త్ర దానం విశేష ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా బెల్లాన్ని దానం చేస్తే లక్ష్మీదేవి ఆనందిస్తుంది అని పెద్దల మాట. తులసి,రావి చెట్ల వద్ద దీప దానం చేస్తే శుభం. గోదానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. చంద్రుడికి పచ్చి పాలను నీటిలో కలిపి ఇవ్వడం ఆనవాయితీ. ఈరోజున 365 ఒత్తులను వెలిగించడం వలన సంవత్సరం పొడుగునా ఏ ఒక్కరోజు వెలిగించకపోయినా….. అన్ని రోజులపుణ్యాన్ని… ఈరోజు వెలిగించే దీపాలతో పొందవచ్చు అని అంటుంటారు.
*దీపం జ్యోతి: పరoబ్రహ్మ
దీపం సర్వతమోపహః
దీ పేన సాధ్యతే సర్వం
సంధ్యా దీపా నమోస్తుతే *..
.🙏🙏🙏సర్వే జనా: సుఖినో భవంతు….

*కార్తీక పౌర్ణమి వైశిష్ట్యం*…. డాక్టర్ ఐ మంజుల శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల విజయవాడ…….
*కార్తీక పౌర్ణమి వైశిష్ట్యం* .. కార్తీక పౌర్ణమి, కార్తీకమాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి తిధి. ఇది చాలా విశిష్టత కలిగిన రోజు. శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం. హరిహరులకు ఎంతో ప్రీతికరమైన మాసం కనుక ఇద్దరినీ సేవిస్తే, ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.అని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి మాసము మనకు ప్రత్యేకమైనది. ఏ మాసపు ప్రత్యేకత ఆ మాసానిది. కార్తీక మాసంలో ప్రతిరోజూ ప్రధానమైనదే. ఏకాదశులు,శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి శక్తివంతమైనవి. నెల రోజుల్లో చేసే పూజల ఫలితం ఒక ఎత్తు.పౌర్ణమి రోజున చేసే పూజ కార్య కలాపాలు ఒక ఎత్తు. **అభిషేక ప్రియో శివః** అభిషేక ప్రియుడు శివుడు గనుక శివాలయములలో రుద్రాభిషేకం చేయించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఏకాదశ రుద్రాభిషేకాలు చేయించిన కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రగాఢ విశ్వాసం.’ ఈ మాసంలో రుద్రాభిషేకాలు,కేదారేశ్వర వ్రతం, కార్తీక దామోదర పూజ,తులసి పూజ, తులసి,ఉసిరి కలిపి పూజ ,క్షీరాబ్ది ద్వాదశి పూజ,దీప దానాలు,పసుపు లింగార్చన.. స్త్రీ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పాలు,తాంబూలం తో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానం చేయటం ముఖ్యమైన కార్యములు.ఇవి ఆచరించినట్లయితే సర్వ శుభాలు చేకూరుతాయి అని పెద్దల శ్రీ సూక్తి. నదీ స్నానములకు ఈ మాసంలో ప్రాముఖ్యత. నదులు సమీపంలో లేనట్లయితే బావుల దగ్గర గాని, చెరువుల వద్ద గాని స్నానమాచరించవలెను. *_గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు* అను శ్లోకంతో స్నానం చేయవలెను.కార్తీక పౌర్ణమి దీపారాధనకు అత్యంత ప్రాముఖ్యం కలిగిన రోజు. శైవాలయాలలో వైష్ణ వాలయాలలో దీపారాధనలు చేస్తారు. శివాలయాలలో ధ్వజస్తంభం మీద *నందా దీపం* పేరుతో అఖండ దీపాన్ని వెలిగిస్తారు. వైష్ణవాలయాలలో ధ్వజస్తంభం ఎదుట, తులసికోట వద్ద,గోపురం మీద,పెరుమాళ్ళ సన్నిధిలో పిండితో చేసిన దీపాలు, ఉసిరికాయల మీద ఇలా పలు రకాలుగా దీపాలను వెలిగిస్తారు. దీపారాధన అనంతరం ఆయా స్థలాల్లో దీపాలను ఉంచటం…… పసుపు,కుంకుమ,అక్షతలు, పుష్పాలు ‘ సమర్పించి అప్పుడు దీపాలను ఆయా స్థలాల్లో ఉంచాలి . ఈరోజు ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర వ్రతం ఒకటి. భక్తులు వాళ్ల కోరికలను నెరవేర్చి సౌభాగ్యాన్ని కలిగించే వ్రతం ఇది. ఈ దీపారాధనలకు ఆవు నెయ్యిని ఉపయోగించడం వలన వాతావరణ కాలుష్యాన్ని కొంతవరకు అరికట్టవచ్చు. ప్రదోషంలో కాలకృత్యాలను తీర్చుకుని శివాలయంలో కానీ విష్ణు ఆలయాల్లో గాని రావి చెట్టువద్ద గాని, అరటి దొప్పలలో గాని, ఆకుదుప్పలలో గాని దీపాలను వెలిగించాలి. నదులలో దీపదానం చేయాలి.అది అవకాశం లేని వాళ్ళు ఇంట్లో ఒక బకెట్లో కానీ…. ఒక టబ్బులో గానీ నీళ్లను తీసుకొని వాటిలో దీపదానం చేయవచ్చు. త్రిపురాసురులను సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. రాక్షస సంహారం జరిగినందున ఆనందంతో శివతాండవం జరిగింది. ఈరోజున దీపాలను వెలిగిస్తే సకల పాపాలు తొలగిపోతాయి.కార్తీక సోమ వారాల్లో మహాభిషేకాలు, రుద్రాభిషేకాలు,శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరపడం పరిపాటి.కార్తీక పౌర్ణమి నాడు సముద్ర స్నానం శుభప్రదం. కార్తీక పౌర్ణమి నాడు అన్నదానం,వస్త్ర దానం విశేష ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా బెల్లాన్ని దానం చేస్తే లక్ష్మీదేవి ఆనందిస్తుంది అని పెద్దల మాట. తులసి,రావి చెట్ల వద్ద దీప దానం చేస్తే శుభం. గోదానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. చంద్రుడికి పచ్చి పాలను నీటిలో కలిపి ఇవ్వడం ఆనవాయితీ. ఈరోజున 365 ఒత్తులను వెలిగించడం వలన సంవత్సరం పొడుగునా ఏ ఒక్కరోజు వెలిగించకపోయినా….. అన్ని రోజులపుణ్యాన్ని… ఈరోజు వెలిగించే దీపాలతో పొందవచ్చు అని అంటుంటారు. *దీపం జ్యోతి: పరoబ్రహ్మ దీపం సర్వతమోపహః దీ పేన సాధ్యతే సర్వం సంధ్యా దీపా నమోస్తుతే *.. .🙏🙏🙏సర్వే జనా: సుఖినో భవంతు….

