కార్తీక పౌర్ణమి భుజంగేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ బత్యాల
రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి
కార్తీక మసంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని రైల్వేకోడూరు పట్టణంలోని భుజంగేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటుచేసిన పౌర్ణమి వేడుకలకు ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు. స్వామివారి దర్శనం అనంతరం బత్యాల (కార్తీకదీపం)జ్యోతి ప్రజ్వల చేశారు.
ఈ సందర్భంగా వేద పండితులు బత్యాల ని శాలువాలు పూలమాలతో ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.


