కామ్రేడ్ శివ నాగరాజు సేవలు మరవలేనివి
ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి
ఆగిరిపల్లి మండల సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చాకిరి శివ నాగరాజు మరణించడం పార్టీకి తీరని లోటు అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎ .రవి అన్నారు. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చాకిరి శివ నాగరాజు సోమవారం ఉదయం అనారోగ్యంతో మరణించారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. నెక్కలం గొల్లగూడెం లోని ఆయన స్వగృహం నందు భౌతిక కాయానికి పలువురు పార్టీ నాయకులు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ నాగరాజు గత 19 సంవత్సరాలుగా సిపిఎం పార్టీ పిలుపులో భాగంగా పలు ప్రజా ఉద్యమాల్లో అంకితభావం తో పనిచేస్తూ సిపిఎం పార్టీ మండల కార్యదర్శిగా ఎదిగారన్నారు. ప్రస్తుతం చిన్నగిరిపల్లిలో ఆక్రమణకు గురైన దళితుల భూముల కోసం జరుగుచున్న భూపారాటంలో ఆయన కీలకపాత్ర పోషిస్తున్నారు అన్నారు. నాగరాజు కుటుంబాన్ని సిపిఎం పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి ఎన్ వి డి ప్రసాద్, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘ కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజు, లింగరాజు, సిపిఎం పార్టీ మండల నాయకులు సత్తు కోటేశ్వరరావు, జహంగీర్ భాష, పలువురు ప్రజా సంఘల నాయకులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

కామ్రేడ్ శివ నాగరాజు సేవలు మరవలేనివి
కామ్రేడ్ శివ నాగరాజు సేవలు మరవలేనివి ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి ఆగిరిపల్లి మండల సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చాకిరి శివ నాగరాజు మరణించడం పార్టీకి తీరని లోటు అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎ .రవి అన్నారు. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చాకిరి శివ నాగరాజు సోమవారం ఉదయం అనారోగ్యంతో మరణించారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. నెక్కలం గొల్లగూడెం లోని ఆయన స్వగృహం నందు భౌతిక కాయానికి పలువురు పార్టీ నాయకులు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ నాగరాజు గత 19 సంవత్సరాలుగా సిపిఎం పార్టీ పిలుపులో భాగంగా పలు ప్రజా ఉద్యమాల్లో అంకితభావం తో పనిచేస్తూ సిపిఎం పార్టీ మండల కార్యదర్శిగా ఎదిగారన్నారు. ప్రస్తుతం చిన్నగిరిపల్లిలో ఆక్రమణకు గురైన దళితుల భూముల కోసం జరుగుచున్న భూపారాటంలో ఆయన కీలకపాత్ర పోషిస్తున్నారు అన్నారు. నాగరాజు కుటుంబాన్ని సిపిఎం పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి ఎన్ వి డి ప్రసాద్, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘ కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజు, లింగరాజు, సిపిఎం పార్టీ మండల నాయకులు సత్తు కోటేశ్వరరావు, జహంగీర్ భాష, పలువురు ప్రజా సంఘల నాయకులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

