పున్నమి ప్రతినిధి :
ఆలంపల్లి దుర్గేష్
9133469506
ప్రజా సేవకుడికి అక్షర నివాళి
ఒక నాయకుడు నడిచిన దారి,
నేడు చరిత్ర పుటల్లో చెరగని స్మృతి.
మీరు వదిలి వెళ్లిన అడుగుజాడ,
పాషా నరహరి వర్ధంతి నాడిది.
పల్లె పల్లెకు చేరిన ప్రజావాక్యం మీరు,
ఓటు కోసం కాదు, ఊరి కోసమే నిలిచారు.
ప్రజల కోసం తమ మాట ఒక ఆయుధం లాగా స్పూర్తితో సభలో మీరు పలికిన ప్రతి మాటా,
పేద ప్రజల కష్టాలను మార్చిన బాటా.
మీ కల నెరవేర్చగ మేము కలసి నడుస్తాం,
మీ ఆశయం మా లక్ష్యం, ఈ రోజు చెబుతాం.
అధికారం శాశ్వతం కాదని చూపారు,
ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం పొందారు.
దొరల పాలనలో ధీరుడు మీరై నిలిచారు,
మా నియోజకవర్గానికి వెలుగుబాట వేశారు.
మీ నిరాడంబరత, నిజాయితీ మాకు స్ఫూర్తి,
వర్ధంతి సందర్భంగా ఇదే మా కన్నీటి హారతి.
మీ పోరాట పటిమను మరువబోము,
మీ జ్ఞాపకాలను గుండెల్లో దాచుకుంటాము.
జయహో కామ్రేడ్! జయహో ప్రజా సేవకా!
మీ ఆత్మకు శాంతి, మాకు ఉద్యమ దీక్ష. నీ బాటలో
* అల్లంపల్లి దుర్గేష్
* నక్కర్త మేడిపల్లి


