కామారెడ్డి 30 జనవరి పున్నమి ప్రతినిధి
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పరిధి లోని ప్రతి గ్రామల రైతులు పాత, కొత్త అని తేడా లేకుం డా ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాల ని వ్యవసాయ అధికారి భాను శ్రీ స్పష్టం చేశారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తిగా నిరంత రం కొనసాగుతోందని చెప్పారు. రిజిస్ట్రేషన్ చేసు కున్న రైతులు మాత్రమే ప్రభుత్వ పథకాలు, సబ్సి డీలు సులభంగా పొందగలుతారని అన్నారు. అందుకే అందరూ త్వరగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసు కోవాలని అధికారి పిలుపునిచ్చారు.రైతులు ఇప్పు డే స్థానిక వ్యవసాయ కార్యాలయాలకు చేరుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. స్థానిక వ్యవసాయ కార్యాలయాల్లో వెంటనే రిజిస్టర్ చేసుకోండి. మీ భవిష్యత్తు కోసం ఇది గొప్ప అవకాశం అని చెప్పారు. కావాల్సిన పత్రాలు పట్టాదార్ ఫోన్ నెంబర్ లింక్ ఉన్న ఆధార్ జిరాక్స్లను, మీ మోబైల్ ను వెంట తీసుకు వెళ్లాలని తెలిపారు.



