కామారెడ్డి, నవంబర్ 13 (పున్నమి ప్రతినిధి ) :
జిల్లా రాజకీయ పరిణామాలు వేగంగా మారుతు న్న వేళ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సంబంధించి కీలక సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమం లో గురువారం జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా.రెడ్డి మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు. బోధ న్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వ కంగా కలిశారు.పట్టణంలో విశ్రాంతి గృహంలో జరిగిన ఈ భేటీలో నా.రెడ్డి మోహన్ రెడ్డి నేతకు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంలో పార్టీ బలోపేతంపై, ప్రభుత్వం చేపడుతున్న పథకా లు ప్రజలకు చేరే విధానంపై వారు చర్చించినట్లు సమాచారం. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగితేనే ప్రజాభిమా నాన్ని నిలబెట్టుకోవచ్చని సూచించారు.అర్హులకు ప్రభుత్వ పథకాలు న్యాయంగా అందేలా క్షేత్ర స్థాయిలో పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు తప్పదని, పార్టీ అధిష్టానం నిబద్ధతతో పనిచేసే నేతలను తప్పక ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు.నా.రెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ పటిష్టానికి తాను సిద్ధంగా ఉన్నట్లు, ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా సుదర్శన్ రెడ్డి ప్రోత్సాహం కీలకం అవుతుందని పేర్కొన్నారు. ఈ భేటీతో జిల్లా రాజకీయ వర్గాల్లో కొత్త చర్చలు మొదలైనాయి.


