కామారెడ్డి, 10 డిసెంబర్,( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లాలో మొదటి విడత గ్రామ పంచా యతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు (10.12. 2025) 10 మండలాల్లో PO/OPO డ్యూటీ అలాట్ అయిన 53 మంది అధికారులు రిపోర్ట్ చేయకపోవడంతో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.ఎన్నికల నిర్వహణ సడంబరంగా జరగా లంటే అధికారులు సమయానికి హాజరు కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. విధి నిర్లక్ష్యం ఎన్నికల పారదర్శకతకు, నాణ్యతకు ఆటంకం కలిగిస్తుందని హెచ్చరించారు. ఈ చర్య జిల్లా ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేస్తుందని అధికారులు తెలిపారు.కామారెడ్డి జిల్లా ప్రజలు ఈ ఎన్నికల్లో అధిక పోలింగ్ రికార్డు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడతలో 10 మండలాల్లో ఎన్నికలు సజగా జరిగేలా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ షోకాజ్ నోటీసులు ఎన్నికల బాధ్యులందరికీ సమయానికి హాజరు కావాలని గట్టి సందేశం.


