ఘ- ప్రజాసేవలో మునిగిపోతామని తీర్మానం!
కామారెడ్డి, 22 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా వివిధ మండలాల్లో గ్రామ పంచాయతీల్లో నూతన పాలకవర్గ సభ్యులు కొలువు దీరారు. పల్లె తండాల్లో ఘనంగా నిర్వహిం చిన ప్రమాణ స్వీకారోత్సవాలు గ్రామ ప్రజల అనందోత్సహాం ఉత్సాహాన్ని రేకెత్తించాయి. ఈ సందర్భంగా సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజల సమక్షంలో ప్రమాణాలు చేసుకుని, గ్రామాభివృద్ధికి, ప్రజాసేవకు నిజాయితీగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.రామారెడ్డి మండలంలో ఉత్సవాల ముందస్తు!రామారెడ్డి మండలంలోని రామారెడ్డి, గిద్ధ, పోసానిపేట్, రంగంపేట్, మోషంపూర్, రెడ్డిపేట్, జగదాంబ తండా, స్కూల్ తండా, భట్టు తండా, అన్నారం, గొడుమర్రీ తండా, కన్నాపూర్ తండా, కన్నాపూర్, గొల్లపల్లి, గోకుల్ తండా, మద్దికుంట, ఉప్పల్వాయి గ్రామాల్లో నూతన పాలకవర్గ సభ్యులు కొలువు దీరారు. ఈ గ్రామాల్లో ఘనంగా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవాలకు గ్రామస్తులు, రాజకీయ నాయకులు, అధికారులు హాజరయ్యారు. డీజే చప్పుల్లు, పూల మాలలు వేసి సర్పంచులను అభినందించారు.
సర్పంచుల హామీలు..
ప్రజలకు మొదటి బాధ్యత! ఈ సందర్భంగా మాట్లాడిన సర్పంచులు, “గ్రామ ప్రజలు మాతో తోడుగా ఉంటే అభివృద్ధి సాధ్యమే. రోడ్లు, నీటి సమస్యలు, విద్య, ఆరోగ్యం.. అన్ని విషయాల్లో ముందుండి ప్రజాసేవలో మునిగిపోతాము” అని అన్నారు. గ్రామాల్లో పెద్దలు, అధికారులు, విద్యార్థు లు, మహిళలు అందరూ పాల్గొన్న ఈ కార్యక్రమా లు గ్రామీణ ఉత్సవ వాతావరణాన్ని సృష్టించాయి. పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల స్కీంలను పూర్తిగా అమలు చేస్తామని సర్పంచులు స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా మొత్తంలో ఇలాంటి కార్యక్రమాలు విస్తృతంగా జరిగాయి.పల్లెల్లో ప్రజలు సర్పంచులను ఆశీర్వ దించడంతో పాటు, తమ గ్రామాల అభివృద్ధి కోసం ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు.ఈ నూత న పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామాలు మరింత ముందుకు సాగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే పంచాయతీ సమావేశా లు ఏర్పాటు చేసి, అభివృద్ధి పనులకు మొదలు పెడతామని హామి ఇచ్చారు.


