కామారెడ్డి, 17 నవంబర్ , (పున్నమి ప్రతినిధి) :
కామారెడ్డి జిల్లాలో కొత్త కరెంట్ మీటర్ కోసం దరఖాస్తు చేయడం ఇప్పుడు చాలా సులభమైంది. మీరు ఇంటర్నెట్‌లో, మీసేవ కేంద్రంలో లేదా TG SPDCL అధికార వెబ్‌సైట్‌లో “కొత్త సేవ కనెక్షన్” విభాగం ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేయవచ్చు.
దరఖాస్తు చేసేటప్పుడు మీకు కావలసిన పత్రాలు:వ్యక్తిగత గుర్తింపు పత్రం (ఆధార్, ఓటరు కార్డు, లేదా డ్రైవింగ్ లైసెన్స్)చిరునామా ధృవీక రణ పత్రం (ఇల్లు పత్రము, అద్దె ఒప్పందం, పాస్ బుక్, లేదా రేషన్ కార్డు)రెండు ఫోటోలుపూర్తి చేసి న అప్లికేషన్ ఫారంఅద్దె ఇళ్లవారి ప్రక్రియఅద్దెకు ఉన్న వారు తమ పేరుమీద మీటర్ తీసుకునేందు కు ఇంటి యజమానితో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) తప్పనిసరి. అద్దె ఒప్పంద పత్రం చిరునా మా రుజువు గా చెల్లుతుంది. ఈ పత్రాలతో పాటు ఆధార్, అప్లికేషన్ మరియు ఫోటోలను మీసేవ కేంద్రంలో లేదా TGSPDCL వెబ్‌సైట్‌లో సమర్పిం చవచ్చు.సొంత ఇల్లు, స్థలం కలిగిన వారుమీ పేరు మీద నమోదు అయ్యిన సొంత ఇల్లు లేదా స్థల పత్రాలు ఉంటే, వాటిని ఆధారంగా తీసుకుని ఆధార్, రేషన్ కార్డు, ఫోటోలతో పాటు దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు సమర్పించిన తర్వాత 3-7 రోజుల్లో మీట్ కంట్రోల్ ప్రారంభం అవుతుంది.ఇల్లు లేకపోయినా సదుపాయం ఇల్లు లేదా స్థిరాస్తి పత్రాలు లేకపోయినవారైతే , మీటర్ కోసం ప్రయ త్నించవచ్చు. వాడుతున్న ప్రామాణిక చిరునామా పత్రాలు, స్థానిక అధికారుల NOC, ఆధార్ కార్డుతో పాటు 600 రూపాయల డిపాజిట్ చెల్లించి దరఖా స్తు చేయవచ్చు.చిన్న పరిశ్రమలకుచిన్న పరిశ్రమల కు కనెక్షన్ కావాలంటే పరిశ్రమ అనుమతులు, పర్యావరణ అనుమతులు, వైరింగ్ సర్టిఫికేట్ వంటి పత్రాలు సమర్పించి TGSPDCL వెబ్‌సైట్‌లోని “Industry Connection” ద్వారా దరఖాస్తు చేయాలి.దరఖాస్తు స్థితిని ఆన్‌లైన్ లో మీ అప్లికేష న్ నెంబర్ ఉపయోగించి గమనించవచ్చు. ఏదైనా సందేహాలు తలెత్తినప్పుడు దగ్గరి మీసేవ కేంద్రం లేదా స్థానిక విద్యుత్ కార్యాలయం సంప్రదించం డి.ఈ సదుపాయం వల్ల కామారెడ్డి జిల్లాలో విద్యుత్ కనెక్షన్ పొందడం కోసం ప్రజలకు భారీ సౌకర్యం కలబడింది.


