Sunday, 7 December 2025
  • Home  
  • కామారెడ్డి జిల్లాలో ఆగని ఇసుక అక్రమ రవాణా: ‘ఇంద్రమ్మ ఇండ్లు’ పేరుతో దందా
- ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ

కామారెడ్డి జిల్లాలో ఆగని ఇసుక అక్రమ రవాణా: ‘ఇంద్రమ్మ ఇండ్లు’ పేరుతో దందా

 కామారెడ్డి,25 సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి    : కామారెడ్డి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛ గా సాగుతోంది. ప్రభుత్వం పేదలకు నిర్మించే ‘ఇంద్ర మ్మ ఇండ్లు’ పథకం పేరుతో దళారు లు ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు ఈ వ్యవహారాన్ని చూసీ చూడనట్లుగా వ్యవహరి స్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ని పలు మండలాలు, గ్రామాల్లో ఇసుక రీచ్‌లలో ఎలాంటి అనుమతులు లేకుండా యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ ఇసుకను తొలు త ‘ఇంద్రమ్మ ఇండ్లు’ పథకం లబ్ధి దారుల కోసం కేటాయించినట్లు చూపిస్తూ, ఒకటి లేదా రెండు ట్రిప్పులు మాత్రమే వారికి ఇస్తున్నారు. మిగిలిన ఇసుకను అధిక ధరలకు బహిరంగంగా విచ్చల విడిగా బిల్డర్లకు, మార్కెట్లో విక్రయించి దళారులు లాభ పడుతున్నారు. ఈ అక్రమ రవాణా వల్ల ప్రభుత్వం ఆదాయం కోల్పోవడమే కాకుండా, పర్యావరణా నికి  తీవ్ర నష్టం జరుగుతోంది. స్థానికు లు, సామాజిక కార్యకర్తలు ఈ అక్రమ రవాణాపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో యంత్రాలు, భారీ వాహనాలతో ఇసుక తరలింపు విచ్చలవిడిగా సాగుతోందని వారు చెబు తున్నారు. ఈ అక్రమ దందాపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిఘా పెంచాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ప్రభుత్వ సమాచారం ప్రకారం, ఇంద్ర మ్మ ఇళ్ల నిర్మాణానికి తక్కువ ధరకే ఇసుకను అందించాలన్న ప్రభుత్వ ఆదేశాలను రెవెన్యూ సిబ్బంది పట్టించుకోకుండా, ఇష్టానుసారం పర్మిష న్లు ఇస్తూ ఇసుకను దుర్వినియోగం చేస్తున్నారనేది ప్రజా  సమస్య…  ఇంద్రమ్మ ఇళ్లకు ఇసుక పక్కదారి:  పేదల కలలకు గండి కొడుతున్న రెవెన్యూ సిబ్బం ది! పేదలకు సొంత ఇళ్లు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం అడుగడుగునా అవినీతి, అక్రమాలతో నీరు గారుతోంది. ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి కేవలం నామమాత్రపు రుసుముతో ఇసుకను అందించాల న్న జిల్లా కలెక్టర్ ఆదేశాలు కాగితాలకే పరిమితం అయ్యాయి. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది ఇష్టానుసారం వ్యవహరిస్తూ, పేదల ఇళ్ల కలను అమ్ముకుంటున్నారు.ప్రభుత్వం పేదలకోసం చేపట్టి న ఈ బృహత్తర పథకంలో కీలకమైన ఇసుక సరఫరాలోనే భారీగా అవకతవకలు జరుగుతు న్నాయి. ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కేవలం రెండు వందల రుసుముతో ఒక ట్రాక్టర్ ఇసుకను ఇవ్వాలని ఉన్నా, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తమకిష్ట మైన వారికి మాత్రమే పర్మిషన్లు జారీ చేస్తున్నారు. పేదలు రోజుల తరబడి కార్యాలయా ల చుట్టూ తిరిగినా పర్మిషన్లు ఇవ్వకుండా వేధిస్తు న్నారని లబ్ధి దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఇలాంటి పర్మిషన్లను అక్రమంగా బయ టి వ్యక్తులకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నా యి. దీంతో మార్కెట్‌లో ఇసుక ధరలు అమాంతం పెరిగిపోయి, ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారు లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అధికా రుల నిర్లక్ష్యం, సిబ్బంది అవినీతి కారణంగా ప్రభు త్వ పథకం  ముఖ్య ఉద్దేశం దెబ్బతింటోంది. ఈ విషయంపై పలువురు లబ్ధిదారులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు లు చేసినా,ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతా ధికారులు జోక్యం చేసుకొని, ఈ అక్రమాలను అరిక ట్టి, పేద లకు సకాలంలో, సరసమైన ధరకే ఇసుక అందేలా చూడాలని కోరుతున్నారు. లేకపోతే, ఇంద్రమ్మ ఇళ్ల కల కేవలం కలగానే మిగిలిపోతుం దని ప్రజలు అభియప్రాయపడుతున్నారు.

కామారెడ్డి జిల్లాలో ఆగని ఇసుక అక్రమ రవాణా: ‘ఇంద్రమ్మ ఇండ్లు’ పేరుతో దందా

 కామారెడ్డి,25 సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి    :

కామారెడ్డి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛ గా సాగుతోంది. ప్రభుత్వం పేదలకు నిర్మించే ‘ఇంద్ర మ్మ ఇండ్లు’ పథకం పేరుతో దళారు లు ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు ఈ వ్యవహారాన్ని చూసీ చూడనట్లుగా వ్యవహరి స్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ని పలు మండలాలు, గ్రామాల్లో ఇసుక రీచ్‌లలో ఎలాంటి అనుమతులు లేకుండా యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ ఇసుకను తొలు త ‘ఇంద్రమ్మ ఇండ్లు’ పథకం లబ్ధి దారుల కోసం కేటాయించినట్లు చూపిస్తూ, ఒకటి లేదా రెండు ట్రిప్పులు మాత్రమే వారికి ఇస్తున్నారు. మిగిలిన ఇసుకను అధిక ధరలకు బహిరంగంగా విచ్చల విడిగా బిల్డర్లకు, మార్కెట్లో విక్రయించి దళారులు లాభ పడుతున్నారు. ఈ అక్రమ రవాణా వల్ల ప్రభుత్వం ఆదాయం కోల్పోవడమే కాకుండా, పర్యావరణా నికి  తీవ్ర నష్టం జరుగుతోంది. స్థానికు లు, సామాజిక కార్యకర్తలు ఈ అక్రమ రవాణాపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో యంత్రాలు, భారీ వాహనాలతో ఇసుక తరలింపు విచ్చలవిడిగా సాగుతోందని వారు చెబు తున్నారు. ఈ అక్రమ దందాపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిఘా పెంచాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ప్రభుత్వ సమాచారం ప్రకారం, ఇంద్ర మ్మ ఇళ్ల నిర్మాణానికి తక్కువ ధరకే ఇసుకను అందించాలన్న ప్రభుత్వ ఆదేశాలను రెవెన్యూ సిబ్బంది పట్టించుకోకుండా, ఇష్టానుసారం పర్మిష న్లు ఇస్తూ ఇసుకను దుర్వినియోగం చేస్తున్నారనేది ప్రజా  సమస్య… 

ఇంద్రమ్మ ఇళ్లకు ఇసుక పక్కదారి: 

పేదల కలలకు గండి కొడుతున్న రెవెన్యూ సిబ్బం ది! పేదలకు సొంత ఇళ్లు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం అడుగడుగునా అవినీతి, అక్రమాలతో నీరు గారుతోంది. ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి కేవలం నామమాత్రపు రుసుముతో ఇసుకను అందించాల న్న జిల్లా కలెక్టర్ ఆదేశాలు కాగితాలకే పరిమితం అయ్యాయి. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది ఇష్టానుసారం వ్యవహరిస్తూ, పేదల ఇళ్ల కలను అమ్ముకుంటున్నారు.ప్రభుత్వం పేదలకోసం చేపట్టి న ఈ బృహత్తర పథకంలో కీలకమైన ఇసుక సరఫరాలోనే భారీగా అవకతవకలు జరుగుతు న్నాయి. ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కేవలం రెండు వందల రుసుముతో ఒక ట్రాక్టర్ ఇసుకను ఇవ్వాలని ఉన్నా, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తమకిష్ట మైన వారికి మాత్రమే పర్మిషన్లు జారీ చేస్తున్నారు. పేదలు రోజుల తరబడి కార్యాలయా ల చుట్టూ తిరిగినా పర్మిషన్లు ఇవ్వకుండా వేధిస్తు న్నారని లబ్ధి దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఇలాంటి పర్మిషన్లను అక్రమంగా బయ టి వ్యక్తులకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నా యి. దీంతో మార్కెట్‌లో ఇసుక ధరలు అమాంతం పెరిగిపోయి, ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారు లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అధికా రుల నిర్లక్ష్యం, సిబ్బంది అవినీతి కారణంగా ప్రభు త్వ పథకం  ముఖ్య ఉద్దేశం దెబ్బతింటోంది. ఈ విషయంపై పలువురు లబ్ధిదారులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు లు చేసినా,ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతా ధికారులు జోక్యం చేసుకొని, ఈ అక్రమాలను అరిక ట్టి, పేద లకు సకాలంలో, సరసమైన ధరకే ఇసుక అందేలా చూడాలని కోరుతున్నారు. లేకపోతే, ఇంద్రమ్మ ఇళ్ల కల కేవలం కలగానే మిగిలిపోతుం దని ప్రజలు అభియప్రాయపడుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.