కామారెడ్డి పున్నమి ప్రతినిధి ఆగస్టు 29
*ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం*
===========================
హాకీ మాంత్రికుడు శ్రీ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లాలో గల ఇందిరాగాంధీ స్టేడియంలో S.G.F ఆధ్వర్యంలో 29-8-25 న ఘనంగా క్రీడా దినోత్సవం జరిగింది.
కామారెడ్డి జిల్లాలో డీ.ఈ.వో గారు హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ చిత్ర పటానికి పూల మాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. యస్.జీ.ఎఫ్ బాధ్యులు శీ నీలం లింగం గారు, ఫిజికల్ డైరెక్టర్లు రంగా వెంకటేశ్వర్ గారు, మోహన్ రెడ్డి గారు, మధుసూదన్ గారు, భాస్కర్ రెడ్డి గారు మొదలైన వారు పాల్గొన్నారు.
డీ.ఈ.వో గారు మాట్లాడుతూ వ్యక్తి నిజ జీవితంలో క్రీడలు అత్యవసరమని , పాఠశాలల్లో విద్యార్థులకు తప్పనిసరిగా ఆటలు ఆడించాలని , విద్యార్థులను క్రీడలలో జాతీయ స్థాయికి తీసుకురావాలని తెలిపారు.
నీలం లింగం గారు మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలన్న, మానసికంగా దృఢంగా ఉండాలన్నా ఆటలనీవి తప్పని సరి అని ఈ విషయంలో ప్రతి వ్యాయామ ఉపాధ్యాయులు పాఠశాలల్లో ప్రత్యేక శ్రద్ధ చూపాలన తెలిపారు. అనంతరం స్టేడియంలో కబడీ, ఖో.ఖో , వాలీ బాల్ , అథెలిటిక్స్ మొదలైనవి ఆడించడం జరిగింది.
కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం
కామారెడ్డి పున్నమి ప్రతినిధి ఆగస్టు 29 *ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం* =========================== హాకీ మాంత్రికుడు శ్రీ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లాలో గల ఇందిరాగాంధీ స్టేడియంలో S.G.F ఆధ్వర్యంలో 29-8-25 న ఘనంగా క్రీడా దినోత్సవం జరిగింది. కామారెడ్డి జిల్లాలో డీ.ఈ.వో గారు హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ చిత్ర పటానికి పూల మాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. యస్.జీ.ఎఫ్ బాధ్యులు శీ నీలం లింగం గారు, ఫిజికల్ డైరెక్టర్లు రంగా వెంకటేశ్వర్ గారు, మోహన్ రెడ్డి గారు, మధుసూదన్ గారు, భాస్కర్ రెడ్డి గారు మొదలైన వారు పాల్గొన్నారు. డీ.ఈ.వో గారు మాట్లాడుతూ వ్యక్తి నిజ జీవితంలో క్రీడలు అత్యవసరమని , పాఠశాలల్లో విద్యార్థులకు తప్పనిసరిగా ఆటలు ఆడించాలని , విద్యార్థులను క్రీడలలో జాతీయ స్థాయికి తీసుకురావాలని తెలిపారు. నీలం లింగం గారు మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలన్న, మానసికంగా దృఢంగా ఉండాలన్నా ఆటలనీవి తప్పని సరి అని ఈ విషయంలో ప్రతి వ్యాయామ ఉపాధ్యాయులు పాఠశాలల్లో ప్రత్యేక శ్రద్ధ చూపాలన తెలిపారు. అనంతరం స్టేడియంలో కబడీ, ఖో.ఖో , వాలీ బాల్ , అథెలిటిక్స్ మొదలైనవి ఆడించడం జరిగింది.

