విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న కాపుల వనభోజన మహోత్సవంకు సంబంధించిన వివరాలను ఈ రోజు విశాఖ ప్రెస్ క్లబ్‌లో జరిగిన పత్రికా సమావేశంలో వెల్లడించారు.
ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు మద్ధింశెట్టి సురేష్ కుమార్, కార్యదర్శి యర్రంశెట్టి సురేష్ మాట్లాడుతూ, “పార్టీలకతీతంగా అన్ని కాపు సోదరులు ఒకే తాటిపైకి వచ్చి ఈ మహోత్సవంలో పాల్గొని ఐక్యతను చాటాలని” కోరారు.
2011 సంవత్సరం నుండి నిరంతరంగా, విజయవంతంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈసారి కూడా ముడుసర్లవా పార్క్లో ఈ మహోత్సవం భవ్యంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, “ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా కాపు సోదరులు ఐక్యంగా ముందుకు వచ్చి కార్యక్రమాన్ని ఘనవిజయం చేయాలని” కోరారు. కాపుల అభివృద్ధి, ఏకతా కోసం అందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.


