(పున్నమి ప్రతినిధి) కాజీపేట సెప్టెంబర్:
కాజీపేట సోమిడి తాళ్ల పద్మావతి హై స్కూల్ ప్రాంగణంలో బతుకమ్మ పండుగ ఉత్సవాలు ఆహ్లాదకరంగా, అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. పాఠశాల ఆవరణ పూల సువాసనలతో, విద్యార్థినుల పాటలు, నృత్యాలతో సందడిగా మారింది. పాఠశాల కరెస్పాండెంట్ ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ పూల పండుగను ప్రారంభించి, సాంప్రదాయాలు, సంస్కృతిని విద్యార్థులు తెలుసుకోవడం అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి, పాటలు పాడి నృత్యాలు చేశారు. చిన్నారుల క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు ఆకర్షణగా నిలిచాయి. ఉపాధ్యాయులు ఈ ఉత్సవాలు విద్యార్థుల్లో సాంఘిక చైతన్యం, సంప్రదాయాల పట్ల గౌరవం పెంపొందించడంలో ఉపయోగకరమని తెలిపారు.


