అమలాపురం, అక్టోబరు 27 (తూర్పు ఉదయం విలేఖరి) : విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలకు అనుగుణం గా ఈ నెల 28వ తేదీ రాత్రి మొంథా తుఫాన్ తీరని దాటే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు పాత్రికేయులతో మాట్లాడుతూ మొంథా తుఫాన్ ప్రభావంతో సోమ వారం ఉదయం 8:30 నుండి వర్షం నెమ్మదిగా ప్రారంభమై తీవ్రతరం అవుతుందన్నారు మచిలీపట్నం_ కాకినాడ మధ్య ప్రాంతంలో ఈనెల 28వ తేదీ మంగళవారం రాత్రి 10:30 గంటలకు తీరాన్ని దాటే అవకాశం ఉందన్నారు తీరాన్ని దాటే సందర్భంలో వర్షంతో కూడిన ఈదురుగాలులు తీవ్రత మరింత ఉదృతంగా ఉండే అవకాశం ఉందన్నా రు. సముద్ర తీర ప్రాంతం వెంబడి 120 పునరావాస కేంద్రాలను ఆహారం వసతి చిన్నారులకు పాలు ఆరోగ్య భద్రత వంటి వసతులతో ఏర్పాటు చేయడం జరిగిం దన్నారు. సముద్ర తీరానికి 30 కిలోమీటర్ల పరిధిలో ముంపు ప్రభావం ఉండే అవకాశం ఉందని గుర్తించి వారందరినీ అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొత్తపేట రామచంద్రపురం డివిజన్లలో కూడా పునరా వాస కేంద్రాలు సిద్ధం చేసి నట్లు తెలిపారు. ఈరోజు సాయంత్రానికి వర్షాలు తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నారు. జాతీయ రహదారులు పంచాయతీ రాజ్ రహదారులు వెంబడి హోర్డింగ్స్, శిథిలావస్థకు చేరిన వృక్షాలను తొల గించేందుకు మున్సిపల్ ఆర్ అండ్ బి అధికారులు చర్యలు చేప ట్టారన్నారు. మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుండి ప్రజలు అందరూ బయట సంచరిం చకుండా ఇళ్లలోనే ఆశ్రయం పొందాలన్నారు. ఆ యొక్క సమయంలో అనవసరంగా ప్రయాణాలు చేయరాదన్నా రు.మొంథా తుఫాన్ ను సమర్థవంతంగా ఎదుర్కొ నేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని ఆయన తెలిపారు. ప్రజలు కూడా ఈ యొక్క మొంథా తుఫాను నేపథ్యంలో ఈ 4 రోజుల పాటు ప్రభుత్వ యంత్రాం గానికి పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు
కాకినాడ వద్దే తీరం దాటనుంది : జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్